Crime: ఐస్ బాక్సులో ఆరుగురు మహిళలు.. అదృష్టం కొద్దీ బయటపడ్డారు..

అక్రమంగా బ్రిటన్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ శీతలీకృత పండ్ల ట్రక్కులో ఇరుక్కుపోయిన ఆరుగురు మహిళలను.. బీబీసీ విలేకరి సాయంతో ఫ్రాన్స్‌ పోలీసులు కాపాడారు. నలుగురు వియత్నాం మహిళలు, ఇద్దరు ఇరాకీ వనితలు అరటిపండ్ల పెట్టెలతో కూడిన కంటెయినర్‌లో నక్కి బ్రిటన్‌ చేరాలనుకున్నారు.ఆ ట్రక్కు బ్రిటన్‌కు కాకుండా వేరే చోటికి వెళ్తోందని తెలిసి ఒక మహిళ తమకు ఊపిరాడటం లేదన్న

Crime: ఐస్ బాక్సులో ఆరుగురు మహిళలు.. అదృష్టం కొద్దీ బయటపడ్డారు..

|

Updated on: Oct 02, 2023 | 9:37 AM

అక్రమంగా బ్రిటన్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ శీతలీకృత పండ్ల ట్రక్కులో ఇరుక్కుపోయిన ఆరుగురు మహిళలను.. బీబీసీ విలేకరి సాయంతో ఫ్రాన్స్‌ పోలీసులు కాపాడారు. నలుగురు వియత్నాం మహిళలు, ఇద్దరు ఇరాకీ వనితలు అరటిపండ్ల పెట్టెలతో కూడిన కంటెయినర్‌లో నక్కి బ్రిటన్‌ చేరాలనుకున్నారు. ఆ ట్రక్కు బ్రిటన్‌కు కాకుండా వేరే చోటికి వెళ్తోందని తెలిసి ఒక మహిళ తమకు ఊపిరాడటం లేదన్న మెసేజ్‌తో పాటు శీతల వాహనంలో తాము గజగజ వణుకుతున్న ఫొటోను , జీపీఎస్‌ లొకేషన్‌ను లండన్‌లో బీబీసీ విలేకరికి ఫోన్‌లో పంపారు. ఆయన ఉత్తర ఫ్రాన్స్‌ అధికారులకు తెలియజేయగా వారు రంగంలోకి దిగి మహిళలను కాపాడారు. ఏటా వేలమంది విదేశీయులు ఫ్రాన్స్‌ నుంచి ట్రక్కుల్లో దాగి బ్రిటన్‌లో ప్రవేశించాలని ప్రయత్నిస్తుంటారు. మరికొందరు ఇంగ్లిష్‌ ఛానల్‌ను బోట్లలో అక్రమంగా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us