15 ఏళ్లుగా అడవిలో నివాసం.. జంతువుల భయం క్షణక్షణ..

|

Dec 03, 2022 | 9:35 AM

ఒడిసాలో ఓ కుటుంబం 15 ఏళ్లుగా అడవిలో నివసిస్తోంది. అక్కడ జంతువుల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. నువాపడ జిల్లా బోడెన్‌ సమితిలోని కైరా గ్రామంలో పగున మాఝి కుటుంబంతో పూరి గుడిసెలో నివసించేవాడు.

ఒడిసాలో ఓ కుటుంబం 15 ఏళ్లుగా అడవిలో నివసిస్తోంది. అక్కడ జంతువుల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. నువాపడ జిల్లా బోడెన్‌ సమితిలోని కైరా గ్రామంలో పగున మాఝి కుటుంబంతో పూరి గుడిసెలో నివసించేవాడు. ఓ రోజు వర్షాలకు గుడిసె కూలిపోవడంతో కొన్ని రోజులు చెట్టు కింద తలదాచుకున్నాడు. కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులవద్ద గోడు వెళ్లబోసుకున్నాడు. వారి నుంచి స్పందన లేకపోవడంతో విసిగిపోయి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయాడు. దొరికిన కర్రలు, రేకులు, విరిగిన పెంకులతో చిన్న గూడు ఏర్పాటు చేసుకొని 15 ఏళ్లుగా కుటుంబంతో అందులోనే నివసిస్తున్నారు. దీనిపై ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. రాత్రయితే చీకట్లోనే కాలం గడుపుతున్నామని, జంతువుల భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని బాధితులు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా తమపై దయ చూపాలని, ఇంటి నిర్మాణానికి సాయం చేయాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దారు ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యుత్‌ స్తంభంలో.. చిక్కుకుపోయిన విమానం..

సిగరెట్‌ తాగుతూ అర్ధ నగ్నంగా.. వర్చువల్‌ హియరింగ్‌లో పాల్గొన్న మహిళా జడ్జి

తోకతో పుట్టిన ఆడశిశువు.. అరుదుగా ‘ట్రూ టెయిల్స్‌’ శిశువుల జననం..

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారానికి 4 రోజులే వర్కింగ్ డేస్..

Digital TOP 9 NEWS: చిన్నారి ప్రాణం తీసిన కోతి..ఏం జరిగిందంటే.! | రైలు ఎక్కలేక ఇబ్బందిపడ్డ మహిళ

Published on: Dec 03, 2022 09:35 AM