SI Dance: ఎమ్మెల్సీ పుట్టిన రోజు వేడుకల్లో ఎస్సై డాన్స్.! అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యాలు చేసిన ఎస్సై..
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు తన స్ధాయిని మరిచాడు.. డాన్సర్లతో కలిసి అశ్లీల నృత్యాలను చించేశాడు.. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరలైపోయింది.. అగ్రహించిన ఉన్నతాధికారులు ఆ ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
అసలే పోలీసును కదా.. చట్టం నా చుట్టం అనుకున్నాడేమో.. డాన్సర్లతో కలిసి రెచ్చిపోయాడు. హద్దులు మీరిన వారిని కంట్రోల్ చేయాల్సిన SI స్వయాన స్టేజీ ఎక్కేశాడు.. అక్కడి జనం ఈలలు వేసి ప్రోత్సహించడంతో మరింత రెచ్చిపోయాడు. తనలో దాగి ఉన్న టాలెంట్‌నంతా బయటకు తీసి సూపర్ హిట్ సాంగ్ ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అంటూ ఓ రేంజ్ లో స్టెప్పులు వేశాడు.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్ ఇన్ స్పెక్టర్ హరికృష్ణ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా టెక్కలి వెంకటేశ్వర కాలనీలో జరిగిన వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. టెక్కలి పోలీసు స్టేషన్‌కు పర్లాంగ్ దూరంలోనే ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు వచ్చిన టెక్కలి SIహరిహృష్ణ అశ్లీల నృత్యాలు పెట్టిన నిర్వాహకులను మందలించాల్సింది పోయి తానే స్వయంగా స్టేజీ ఎక్కి స్టెప్పులేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.. వెంటనే క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.. ఎస్సై హరికృష్ణను VRకు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..