బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన ఖాతాదారుడు.. కట్ చేస్తే వీడియో
నాగలాపురం బ్యాంకులోఖాతాదారులు తమ అవసరాల కోసం నగలు కుదవపెట్టి, రుణం తీసుకున్నారు. అప్పు చెల్లించి తాకట్టు పెట్టిన నగలు విడిపించుకునేందుకు ఓ ఖాతాదారుడు వచ్చారు. ఆ నగలపై అదనంగా రుణం ఉన్న విషయం తెలియడంతో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. తిరుపతి జిల్లాలో ఒక బ్యాంకులో బంగారు ఖాతాలకు కష్టోడియన్‌గా ఉండాల్సిన ఉద్యోగి.. ఆ గోల్డ్‌ను కాజేసాడు. ఏకంగా 67 ఖాతాలకు సంబంధించిన బంగారాన్ని తన సొంతానికి వాడుకున్నాడు.
నాగలాపురం యూనియన్ బ్యాంక్ లో ఈ ఘటన జరిగింది. డిప్యూటీ మేనేజర్ సూర్య తేజ చేతివాటం బయటపడింది. బ్యాంకులోని గోల్డ్ లోన్ ఖాతాలపై కన్నేసి సొంత అవసరాలు తీర్చుకున్న సూర్య తేజ వ్యవహారంపై కేసు నమోదయింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారుపై కన్నేసిన సూర్యతేజ.. 2024 మే నుంచి 2025 ఫిబ్రవరి 10వ తేదీ వరకు బ్యాంకులో బంగారు నగలపై రుణాలు పొందినవారి ఆభరణాలను తీసి బయట వ్యక్తులకు ఇచ్చి తిరిగి అదే బ్యాంక్‌లో తనఖా పెట్టించాడు. స్నేహితులు, ఇంకా తెలిసిన వారి పేరుతో అదే బ్యాంక్‌లో డిపాజిట్ చేసి గోల్డ్ లోన్స్ తీసుకున్నాడు. దాదాపు 67 ఖాతాలకు చెందిన గోల్డ్‌ను ఇలా తిరిగి తాకట్టు పెట్టేశాడు. బ్యాంక్ లాకర్‌లోని 37 బ్యాగుల్లోని నగలను మొదటగా తీసుకుని అదే బ్యాంకులో తాకట్టు పెట్టిన సూర్య తేజ రూ 1.31 కోట్లు రుణం పొందాడు. మరో 30 బ్యాగుల్లో ఉన్న నగలను తీసుకెళ్లి నాన్ ఫైనాన్షియల్ ప్రైవేటు కంపెనీలలో తాకట్టు పెట్టాడు.
మరిన్ని వీడియోల కోసం :
వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో
ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..
కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..
వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
