Viral Video: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో కారు.. రూఫ్‌పై తాళ్లతో బంధించిన యువకుడు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్.. అసలేం జరిగిందంటే?

కొందరు వ్యక్తులు ప్రమాదాలతో సహవాసం చేస్తుంటారు. దీని కోసం వారు తమ జీవితాలను కూడా పట్టించుకోరు. తన కారు పైకప్పుపై కూర్చొని ఎంతో వేగంతో ప్రయాణించిన ఓ వ్యక్తి వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral Video: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో కారు.. రూఫ్‌పై తాళ్లతో బంధించిన యువకుడు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్.. అసలేం జరిగిందంటే?
Danil

Edited By: Anil kumar poka

Updated on: Sep 06, 2021 | 7:41 PM

Viral Video: ఎంతో మంది వింత వ్యక్తులు, వారి ప్రత్యేక కథనాలు ప్రపంచవ్యాప్తంగా మనకు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి చాలా మంది వ్యక్తులు.. తమ అభిరుచిని నెరవేర్చుకోవడంలో ఎంతవరకైనా వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎన్నో వింత పనులు చేస్తుంటారు. ఒక రష్యన్ రోడ్డుపై కారుతో అలాంటి ఓ ఫీట్ చేసి, నెట్టింట్లో వైరల్‌గా మారాడు. ఈ వీడియోను చూసి ప్రజలు కొంత గగుర్పాటుకు కూడా గురయ్యారు. అయితే ఈ చర్య కాస్త అతడిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. అతను రోడ్డుపై కారుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న వీడియో నెట్టింట్లో చూసిన పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

కొన్నిసార్లు ఇలాంటి కొన్ని సంఘటనలు మన చుట్టూ జరుగుతుంటాయి. అసలు విషయంలోకి వెళ్తే.. రష్యన్ ఇన్‌ఫ్లుయెన్సర్ డానిల్ మయాస్నికోవ్.. కారు పైకప్పుపై అతివేగంతో ప్రయాణించి దానిని వీడియో తీశాడు. దాదాపు 180 కి.మీ వేగంతో నడుస్తున్న కారులో పైకప్పుపై కూర్చుని తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. టేప్, తాడు సహాయంతో తనను కారుకు ఓవైపు కట్టుకున్నాడు. డేనియల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పంచుకున్నాడు. కారుపై ఇలాంటి స్థితిలో కూడా ఎలాంటి భయం లేకుండా గాలిలో మాట్లాడుతూ వీడియో తీసుకున్నాడు. వీడియోలో, డానిల్ కారుకు టేప్‌తో తనను తాను కట్టేసుకోవడం కనిపిస్తుంది. అతను తన స్నేహితులను రోడ్డుపై 112 mph వేగంతో నడపమని కోరాడు. ఈ కారును వేరొకరు నడుపుతున్నట్లు, డేనియల్ కారు బయట తాళ్లతో బంధించినట్లు కనిపించడం మనం చూడొచ్చు.

అయితే, ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో వెంటనే డానియల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 2.5 లక్షల మందికి పైగా దీనిని చూశారు. దీనిపై పలవురు కామెంట్లు కూడా పంచుకున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయవద్దంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

Also Read:

Virat Kohli: పెవిలియన్ చేరిన కోహ్లీ కోపంతో ఏంచేశాడో తెలుసా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Viral Video: ఈ వధువు చూడండి వివాహాన్ని ఎలా ఆస్వాదిస్తుందో.. వీడియో చూస్తే వావ్ అంటారు

Viral Video: తుపాకులతో షాపులోకి ఎంట్రీ.. గన్స్‌తో బెదిరించారు.. కట్‌చేస్తే.. వీడియో వైరల్‌..