Rat in Chicken: రెస్టారెంట్‌లోని చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక..షాక్ తిన్న కస్టమర్లు.
వీకెండ్‌లో సరదాగా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్తామనుకుంటున్నారా.. జాగ్రత్త.. అక్కడ మీరు ఆర్డర్ చేసే ఆహారంలో ఏ జీవులు ప్రత్యక్షమవుతాయో.. ఎందుకంటే ఓ దాబాలో కుటుంబంతో కలిసి వెళ్లి హాయిగా భోజనం చేద్దామనుకున్న ఓ ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది.
ఫీల్డ్ గంజ్ ప్రాంతంలోని ప్రేమ్ నగర్‌కు చెందిన వివేక్ సాయంత్రం తన కుటుంబంతో కలిసి లూథియానాలోని ఓ దాబాకు వెళ్లాడు. చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. సప్లై చేసిన భోజనంలో కొంత తిన్న తర్వాత అనుమానం వచ్చింది. భోజనం ఏదో తేడాగా ఉందని గమనించారు. తీరా కర్రీ బౌల్లోకి చూసేసరికి అందులో చికెన్‌కి బదులుగా చనిపోయిన ఎలుక కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమానిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాదానం ఇచ్చారంటూ వాపోయాడు. దాంతో వివేక్ కుమార్ ఇదంతా వీడియో రికార్డ్ చేసి అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశాడు. దాంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. హోటల్ యజమానిపై కేసు నమోదైంది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకున్నారు లూథియానా సిటీ పోలీసులు. ఎలుక చచ్చిన ఆహారం తినడంతో తాను, తన కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యామని వివేక్ కుమార్ తెలిపారు. దాబా యాజమాన్యం నిర్లక్ష్యంపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...