Golgappa Shake: ద్వేవుడా.. ఇదేం షేక్‌రా నాయనా.. చూస్తుంటేనే బుర్ర తిరుగుతోంది..! పానీపూరీతో షేక్.. వీడియో

|

Mar 09, 2022 | 9:22 AM

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రకరకాల వినూత్న వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రకరకాల వినూత్న వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది చూసి ‘పానీపూరీ’ ప్రియులు వామ్మో ఇదేంటిరా నాయనా..? అంటూ తలబాదుకుంటున్నారు. ఆ విచిత్ర వంటకం ఏంటంటే.. ‘గోల్గప్పా షేక్’. ఇది చూస్తే తయారు చేయడం చాలా ఈజీ. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. రుచి ఎలా ఉంటుందనేది ట్రై చేస్తేనే తెలుస్తుంది. కానీ.. ఈ విచిత్ర షేక్ చూసి వాంతులు అవుతున్నాయంటూ నెటిజన్లు ఇంటర్నెట్ వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిని చూసి నెటిజన్లు ఇదేం పోయే కాలం రా..? నాయనా.. ఇలా చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో ఓ వ్యక్తి ‘గోల్గప్ప షేక్’ తయారు చేస్తున్నాడు. మొదట అతను మిక్సర్‌లో రెండు గొల్గప్పలను వేసాడు. తరువాత కొన్ని ఉడికించిన బంగాళాదుంపలు, రెడ్ చట్నీ, పుల్లని నీరు కలిపాడు. దీని తరువాత కొద్దిగా ఐస్ జోడించి.. మిక్సర్ ఆన్ చేసాడు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాసులో పోసి.. గొల్గప్ప పొడిని వేసాడు. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలతో అలంకరించాడు. ఈ వీడియోను ఓ ఫుడ్‌ బ్లాగర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు వేలాది మంది వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు. ఇది చూస్తేనే వాంతులు వస్తున్నాయంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్