విడాకులకు సిద్ధమైన దంపతులు.. చిన్నారి జవాబుతో చలించిన జడ్జి..
ఓ చిన్నారికి న్యాయస్థానంలో విషమ పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ గుక్కతిప్పుకోకుండా సమాధానమిచ్చింది. దీంతో కోర్టులో జడ్జిని ఆలోచనలో పడేసింది.
ఓ చిన్నారికి న్యాయస్థానంలో విషమ పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ గుక్కతిప్పుకోకుండా సమాధానమిచ్చింది. దీంతో కోర్టులో జడ్జిని ఆలోచనలో పడేసింది. ఒకవైపు అమ్మ.. మరోవైపు నాన్న.. నీకు ఎవరు కావాలంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు.. వారిద్దరూ కావాలని ఆరేళ్ల చిన్నారి తడుముకోకుండా బదులిచ్చింది. ఈ జవాబుతో చలించిన న్యాయమూర్తి.. అనంతరం ఆమెను అక్కున చేర్చుకున్నారు. కనీసం పాప భవిష్యత్తు కోసమైనా కలిసుండాలని తల్లిదండ్రులను కోరారు. షాద్‌నగర్ పట్టణంలోని కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కల్వకుర్తి పరిధిలోని మాడ్గుల గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు విడాకులు కావాలంటూ లోక్‌అదాలత్‌లో న్యాయమూర్తిని ఆశ్రయించారు. ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్న ఆరేళ్ల బాలికతో న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి తొలుత మాట్లాడారు. తనకు తల్లిదండ్రులిద్దరూ కావాలంటూ కంటతడి పెట్టిన చిన్నారిని చూసి ఆమె చలించిపోయారు. అనంతరం భార్యాభర్తలు విడిపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది దంపతులకు అవగాహన కల్పించారు. కలిసి ఉండాలని కోరడంతోపాటు ఆలోచించుకునేందుకు 15 రోజులగడువు ఇచ్చారు జడ్జి రాజ్యలక్ష్మి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బామ్మకు దడ పుట్టించినఇంట్లోని బాతు బొమ్మ.. వీడియో చూస్తే షాక్
Digital TOP 9 NEWS: మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి.! | ఆ తర్వాత గుండెపోటుతో
TOP 9 ET News: RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ | ఆ తర్వాతే నా పెళ్లి హీరో విశాల్ క్లారిటీ
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

