బామ్మకు దడ పుట్టించినఇంట్లోని బాతు బొమ్మ.. వీడియో చూస్తే షాక్
ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వృద్ధురాలికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వృద్ధురాలికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏవైనా శబ్దాలు వినిపిస్తే.. ఎన్నో రకాల ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. దెయ్యాలు వచ్చాయేమో అని భయపడిపోతుంటాం. లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా కదిలి, కదలనట్టు ఉన్నా కూడా శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ వృద్ధురాలు తన ఇంట్లోనే సోఫాపై కూర్చుంది. కార్పెట్‌కు అనుకుని ఓ బాతు బొమ్మ ఉంది. ఆ బొమ్మను బామ్మ రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటుంది. కానీ ఈసారి ఆ బాతు బొమ్మలో ఆమెకు దెయ్యం కనిపించింది. బాతు ఒక్కోసారిగా కదిలింది. కదిలి, కదలనట్లు ఉండటంతో ఆమె ఆ బొమ్మ వైపే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఒక్కసారి బాతు ఆమె కాళ్ల దగ్గరకు రివర్స్‌లో దూసుకెళ్లింది. దీంతో వృద్ధురాలు భయపడి సోఫా నుంచి కింద పడిపోయింది. గుండె ఆగినంత పనైంది ఆ బాతు బొమ్మ చేసిన పనికి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి.! | ఆ తర్వాత గుండెపోటుతో
TOP 9 ET News: RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ | ఆ తర్వాతే నా పెళ్లి హీరో విశాల్ క్లారిటీ
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

