Largest Hindu Temple: 185 ఎకరాల్లో అమెరికాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం..

Largest Hindu Temple: 185 ఎకరాల్లో అమెరికాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం..

Anil kumar poka

|

Updated on: Sep 29, 2023 | 9:53 PM

అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్‌విల్లేలో ఈ అద్భుత ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయాన్ని స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌గా పిలుస్తారు. 19వ శతాబ్దం నాటి ఆధ్మాత్మిక గురువు భగవాన్‌ స్వామి నారాయణ్‌కు ఈ అద్వితీయమైన ఆలయాన్ని అంకితమిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్తలు తెలిపారు.

అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్‌విల్లేలో ఈ అద్భుత ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయాన్ని స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌గా పిలుస్తారు. 19వ శతాబ్దం నాటి ఆధ్మాత్మిక గురువు భగవాన్‌ స్వామి నారాయణ్‌కు ఈ అద్వితీయమైన ఆలయాన్ని అంకితమిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్తలు తెలిపారు. మొత్తం 185 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏళ్ల క్రితమే శిథిలమైన ఆలయం స్థానంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ భారీ ఆలయ నిర్మాణం కోసం ఉత్తర అమెరికా నలు మూలల నుంచి 12,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రపంచంలోని ఇతర అక్షర్‌ధామ్‌ ఆలయాల మాదిరిగానే ఈ ఆలయాన్ని కూడా డిజైన్‌ చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. ఆలయంలో 10 వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయి. భారతీయ సంగీత పరికరాలు, నృత్య రీతులకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. ఒక ప్రధాన మందిరంతో పాటు, 12 ఉప మందిరాలు, తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం కూడా ఉంది. సాంప్రదాయ రాతి నిర్మాణంతో ఆలయాన్ని రూపొందించారు. సున్నపురాయి, గ్రానైట్, పాలరాయితో సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాతిని దీని నిర్మాణానికి ఉపయోగించారు. వాటిని భారత్‌, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించారు. ఆలయంలో ఉన్న సాంప్రదాయ మెట్ల బావి ‘బ్రహ్మ కుండ్’ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 నదుల నుండి నీటిని సేకరించి కలిపారు. అక్టోబరు 18 నుంచి ఆలయాన్ని సందర్శకుల కోసం తెరవనున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ ఆలయాన్ని నవంబర్‌ 8న అధికారికంగా ప్రారంభించనున్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ తర్వాత రెండవ అతిపెద్ద ఆలయంగా న్యూజెర్సీ స్వామినారాయణ్‌ టెంపుల్ చరిత్రకెక్కింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..