సముద్ర గర్భంలో రహస్య జీవిని కనుగొన్న న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు

|

Sep 30, 2024 | 9:26 PM

సముద్రం ఎన్నోరకాల జీవులకు నివాసస్థానం. వింత వింత జీవులు సముద్రంలో సంచరిస్తాయి. సముద్రం గర్భంలో జీవులపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా సముద్రగర్భంలో అత్యంత రహస్యంగా సంచరించే ఓ అరుదైన షార్క్‌ చేపను గుర్తించినట్లు న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు మంగళవారం ప్రకటించారు. పసిఫిక్‌ మహా సముద్రంలో మైలుకు పైగా లోతులో ఇది సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు.

సముద్రం ఎన్నోరకాల జీవులకు నివాసస్థానం. వింత వింత జీవులు సముద్రంలో సంచరిస్తాయి. సముద్రం గర్భంలో జీవులపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా సముద్రగర్భంలో అత్యంత రహస్యంగా సంచరించే ఓ అరుదైన షార్క్‌ చేపను గుర్తించినట్లు న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు మంగళవారం ప్రకటించారు. పసిఫిక్‌ మహా సముద్రంలో మైలుకు పైగా లోతులో ఇది సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. పొట్టి ముక్కుతో ఉండే దీనిని స్పూక్‌ ఫిష్‌ జాతికి చెందినదిగా చెబుతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జలాల్లో ఇది జీవిస్తున్నట్లు విల్లింగ్టన్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ అట్మోస్పియరిక్‌ రీసెర్చ్‌’ వెల్లడించింది. న్యూజిలాండ్‌కి దక్షిణాన ఉన్న ఒక ద్వీపం సమీపంలోని ‘ది ఛాతమ్‌ రైజ్‌’ అనే ప్రాంతంలో ఇవి ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రదేశం దాదాపు 1,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ కొత్త చేప జాతికి ‘హర్రియోటా అవియా’ అనే పేరు పెట్టినట్లు శాస్త్రవేత్త బ్రిట్‌ ఫినూసీ వెల్లడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??

నడి రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పైన ముద్దుల వర్షం

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు.. దసరా సెలవులపై ఫుల్ క్లారిటీ

Follow us on