Viral: ల్యాండ్‌ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 297 మంది.

Viral: ల్యాండ్‌ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 297 మంది.

Anil kumar poka

|

Updated on: Jul 15, 2024 | 7:49 AM

ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అవుతుండగా సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. దాంతో విమానంలో ఉన్న 297 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన పాకిస్థాన్‌లో జరిగింది. 297 మందితో ప్రయాణించిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి.

ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అవుతుండగా సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. దాంతో విమానంలో ఉన్న 297 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన పాకిస్థాన్‌లో జరిగింది. 297 మందితో ప్రయాణించిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. రియాద్‌ నుంచి పెషావర్‌ చేరుకున్న ఆ విమానం ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఒక టైర్‌ నుంచి పొగలు వ్యాపించాయి.

దీనిని గమనించిన ఏటీసీ సిబ్బంది పైలట్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే విమానాన్ని రన్‌వే వద్ద నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్‌ ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. విమానం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పొగలను నియంత్రించారు. ఈ సంఘటనను సౌదీ ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది. విమానం ఎమర్జెన్సీ డోర్‌ నుంచి ప్రయాణికులు దిగుతున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.