ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్‌

Updated on: Dec 23, 2025 | 1:15 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా సౌదీ అరేబియాలోని జెడ్డా టవర్ 2028 నాటికి రికార్డు సృష్టించనుంది. బుర్జ్ ఖలీఫా రికార్డును బద్దలు కొట్టి, 1,000 మీటర్లకు పైగా ఎత్తుతో ఇది నిలవనుంది. విలాసవంతమైన హోటళ్ళు, నివాసాలు, కార్యాలయాలతో సౌదీ "విజన్ 2030" లో భాగంగా ఈ ప్రాజెక్టు వేగంగా నిర్మాణంలో ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు సృష్టించనుంది సౌదీ అరేబియాలోని జెడ్డా టవర్‌. ఇప్పటికే దాదాపు 80 అంతస్తులు పూర్తయ్యాయి. మరో 80 అంతస్తుల నిర్మాణం వేగంగా సాగుతోంది. ప్రతీ 3 నుంచి 4 రోజులకు ఒక కొత్త అంతస్తును నిర్మిస్తూ, 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాకి పేరుంది. ఆ రికార్డును జెడ్డా టవర్ బద్దలు కొట్టనుంది. దీని ఎత్తు 1,000 మీటర్లు అంటే ఒక కిలోమీటర్‌కు పైగా ఉండనుంది. బుర్జ్ ఖలీఫా కంటే ఇది దాదాపు 172 నుంచి 180 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ టవర్ ప్ర‌త్యేక‌త‌ల విషయానికొస్తే.. ఎర్ర సముద్రం అందాల కోసం స్కై-హై అబ్జర్వేషన్ డెక్‌, విలాసవంతమైన ఫోర్ సీజన్స్ హోటల్, లగ్జరీ నివాసాలు, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లు, అత్యాధునిక ఆఫీసులు ఇందులో ఉంటాయి. సౌదీ అరేబియా ప్రతిష్ఠాత్మక ‘విజన్ 2030’లో భాగంగా టవర్‌ను నిర్మిస్తున్నారు. 160కి పైగా అంతస్తులతో నిర్మితమవుతోంది. అంతేకాకుండా రెండు కిలోమీటర్ల ఎత్తైన ‘రైజ్ టవర్’ నిర్మాణానికి కూడా దుబాయ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బుర్జ్ ఖలీఫా డిజైనర్లలో ఒకరైన ఏడ్రియన్ స్మిత్ ఈ టవర్‌ను డిజైన్‌ చేయడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి

ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్‌ పిడిగుద్దులు.. కారణం

ఇలా అయిపోతున్నారేంట్రా.. హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్‌అప్స్‌.. అక్కడ నుండి..

Boyapati Sreenu: ట్రోల్స్ పై బోయపాటి రియాక్షన్.. ఆల్రెడీ హమ్‌నే కాషన్ కీయ