కార్తీక మాసంలో మూడోరోజు కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం.. వీడియో
కార్తీక మాసం ఆరంభంలోనే కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం కనిపించింది. కర్నూలు జిల్లాలోని ప్రముఖ సంగమేశ్వర ఆలయ శిఖర కలశం జలాధివాసం నుంచి బయటపడింది.
కార్తీక మాసం ఆరంభంలోనే కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం కనిపించింది. కర్నూలు జిల్లాలోని ప్రముఖ సంగమేశ్వర ఆలయ శిఖర కలశం జలాధివాసం నుంచి బయటపడింది. మూడు నెలలపాటు ఈ ఆలయం పూర్తిగా నీటిలో ఉండిపోగా.. కార్తీక మాసం మూడోరోజున కలశం దర్శనమిచ్చింది. వేద పండితులు కలశానికి శాస్త్రోక్తంగా పూజా క్రతువులు చేపట్టారు. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ రోజు రోజుకు తగ్గిపోతుండటంతో.. సంగమేశ్వర క్షేత్రం క్రమంగా బయటకు కనిపించనుంది. మిగతా ఆలయాల్లో ఏడాది పొడవునా భక్తులు దైవ దర్శనం చేసుకునే వీలు ఉంటుంది. కానీ సంగమేశ్వరంలో మాత్రం.. ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే ఇది సాధ్యం అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో
నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos