Viral: పక్షుల కోసం అర ఎకరం పొలంలో పంట సాగు.! సొంత ఖర్చులతో పంటవేసిన రైతు.
అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అని నానుడి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అడక్కుండానే నోరులేని పక్షులకు ఆహారం అందిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. కరోనా సమయంలో ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి ఆహారం అందించిన సమయంలో ఆ వ్యక్తి తనకు రోజూ అన్నం పెట్టమని అర్ధించడంతో అతనిలో ఈ ఆలోచన కలిగింది. ఇతనికి నోరు ఉంది కనుక ఆకలి అని అడిగాడు.. మరి మాటలు రాని పక్షుల పరిస్థితి ఏంటని ఆలోచించాడు.
అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అని నానుడి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అడక్కుండానే నోరులేని పక్షులకు ఆహారం అందిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. కరోనా సమయంలో ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి ఆహారం అందించిన సమయంలో ఆ వ్యక్తి తనకు రోజూ అన్నం పెట్టమని అర్ధించడంతో అతనిలో ఈ ఆలోచన కలిగింది. ఇతనికి నోరు ఉంది కనుక ఆకలి అని అడిగాడు.. మరి మాటలు రాని పక్షుల పరిస్థితి ఏంటని ఆలోచించాడు. వెంటనే తన పొలంలో పక్షులకోసం సజ్జ సాగుచేయడం ప్రారంభించాడు ఈ పక్షి ప్రేమికుడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దేవదాసు పక్షి ప్రేమికుడు. అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఊరిలో అందరూ పత్తి, వరి పంటనే సాగు చేస్తుండడంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారింది. దాంతో దేవదాసు తనకున్న అర్ధ ఎకరా పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు. కరోనా సమయంలో ఆహారం దొరక్క ఓ బిక్షగాడు ఆకలితో అలమటిస్తుంటే ఆ సమయంలో దేవదాసు అతనికి ఆహారం తెచ్చి ఇచ్చాడు. ఆ బిక్షగాడు దేవదాసుతో.. కరోనా కారణంగా తనకు ఎక్కడ ఆహారం దొరకడం లేదని, తననే రోజూ అన్నం పెట్టమని వేడుకోవడంతో దేవదాసు మనసు చలించిపోయింది. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే నోరులేని పక్షుల పరిస్థితి ఏంటనే ఆలోచన వచ్చింది. వెంటనే తనకున్న పొలం లో పక్షుల సజ్జ పంట వేశాడు. రెండున్నరేళ్లుగా ఇలా పక్షులకు ఆహారం అందిస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.