Sachin Tendulkar: సచిన్ బాల్యాన్ని గుర్తుచేసిన బస్సు.. లోకల్ బస్సులో ఎక్కి ప్రయాణించిన సచిన్..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. వైవిధ్యమైన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తాజాగా తన బాల్య స్మృతులను షేర్ చేశారు. బాల్యంలో ఆయన ప్రయాణించిన లోకల్ బస్‌లో ఎక్కి బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. వైవిధ్యమైన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తాజాగా తన బాల్య స్మృతులను షేర్ చేశారు. బాల్యంలో ఆయన ప్రయాణించిన లోకల్ బస్‌లో ఎక్కి బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు. సచిన్ షేర్ ఆ వీడియోను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. తమ అనుభవాలనూ పంచుకుంటున్నారు.ముంబయిలోని శివాజీ పార్క్‌లో సచిన్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్న విషయం అభిమానులకు తెలిసిందే. కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కోచింగ్‌లో సచిన్ ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా ఎదిగారు. అక్కడి నుంచి సచిన్ క్రికెట్లో సాధించిన ఘనతల గురించి, టీమ్‌ఇండియాకు అందించిన మరుపురాని విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా సచిన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌పై మాజీ క్రికెటర్ దిలీప్ జోషీ..‘బాల్యాన్ని గుర్తు చేసుకోవడానికి మించిన మధురానుభూతి మరోటి లేదు. అదిచ్చే సంతోషానికి మరేది సాటిరాదు’ అంటూ కామెంట్ చేశారు. ‘చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కి ధన్యవాదాలు’ అని మరో యూజర్ రాసుకొచ్చారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..