Viral Video: ఈ బుడ్డోడి బ్యాటింగ్ చూసి సచిన్ టెండూల్కర్ ఫిదా.. చిన్నారి తండ్రి చేసినపనికి అందరూ షాక్..(వీడియో)
సోషల్ మీడియా పుణ్యామా అని ఎందరో ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తోంది. ఇటీవల కోల్‌కతాకు చెందిన 5 ఏళ్ల ఎస్‌కే షాహిద్ క్రికెట్ ఆడుతూ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచాడు.
సోషల్ మీడియా పుణ్యామా అని ఎందరో ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తోంది. ఇటీవల కోల్‌కతాకు చెందిన 5 ఏళ్ల ఎస్‌కే షాహిద్ క్రికెట్ ఆడుతూ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచాడు. అతని బ్యాటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షేన్ వార్న్‌లాంటి అనుభవజ్ఞులు కూడా అతనిని పొగడటం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆ బాలుడి చిరకాల కోరిక కూడా నెరవేరింది. షాహిద్ తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ ను కలిసే అవకాశం మాత్రమే కాకుండా, అతనితో ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కూడా పొందాడు.షాహిద్ క్రికెట్ ఆడుతున్న తీరు టెండూల్కర్ దృష్టిని ఆకర్షించింది. ముంబైలోని టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ నుంచి షాహిద్‌కు కాల్ వచ్చింది. కానాయిజర్ కోచ్‌ల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దక్కింది. విషయం ఇక్కడితో ముగియలేదు. ఈ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో షాహిద్ సచిన్ టెండూల్కర్‌తో ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ చేసి, బ్యాటింగ్ ట్రిక్స్ నేర్చుకున్నాడు. షాహిద్, అతని కుటుంబం ముంబై పర్యటనకు అయ్యే ఖర్చు మొత్తాన్ని టెండూల్కరే భరించడం విశేషం. కాగా షాహిద్ తండ్రి కోల్‌కతాలో హెయిర్ సెలూన్ నడుపుతుంటారు. తన ఐదేళ్ల కుమారుడికి ఈ అవకాశం రావడంతో చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. . గత సంవత్సరం ఈ బుడ్డోడికి చెందిన ఓ వీడియోను ట్విట్టర్‌లో అతని తండ్రి పోస్ట్ చేశాడు. అందులో షాహిద్ షాట్లు చాలా మంది అనుభవజ్ఞుల దృష్టిని ఆకర్షించాయి. వారిలో దివంగత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా ఉన్నారు. డిసెంబర్ 2021లో, వార్న్ షాహిద్ గురించి ఓ ట్వీట్ కూడా చేశారు. కేవలం 3 నెలల్లోనే, సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్ నుంచి షాహిద్ నేర్చుకునే అవకాశాన్ని పొందాడు. అయితే వార్న్ దానిని చూడలేకపోయాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)