Navi Officer Song: ఈ నేవీ ఆఫీసర్ పాడిన పాటను విని తీరాల్సిందే.. ఆఫీసర్‌ గాత్రానికి ఫిదా.. వీడియో.

|

Nov 18, 2022 | 9:32 AM

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది. అయితే అందరికీ అది నెరవేర్చుకునే అవకాశం ఉండదు. పరిస్థితుల వల్లో, మరో కారణంగానో తమకు ఇష్టమైన రంగాలలోకి వెళ్లలేక ఇతర రంగాల్లో స్థిరపడతారు.


ఓ రిటైర్డ్‌ నేవీ అథికారికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో ఆయన స్టేజ్‌పైన పాటపాడారు. బాలీవుడ్ మూవీ ‘పాపా కెహతే హై’ లోని ‘ఘర్ సే నికల్తే హై’ పాటను నేవీ రిటైర్డ్ అధికారి చాలా అద్భుతంగా పాడారు. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఈ పాటను పాడారు. అయితే ఈ నావికాదళ అధికారి కూడా ఈ పాటను ఉదిత్ మాదిరిగా చాలా అందంగా పాడారు. అంతే కాకుండా ఆయన స్వరం, ఉదిత్ స్వరం ఒకటేనేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. స్టేజ్ పై అద్భుతంగా పాట పాడిన ఈ రిటైర్డ్ నేవీ అధికారి పేరు గిరీష్ లూథ్రా. నేవీ వెస్ట్రన్ కమాండ్‌ కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా విధులు నిర్వహించిన ఆయన 2019లో పదవీ విరమణ చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నౌకాదళంలో సేవలందించిన ఆయన.. తన అభిరుచిని నెరవేర్చుకునే అవకాశాన్ని ఏర్పరచుకున్నారు. నౌకాదళ స్వర్ణోత్సవ కార్యక్రమంలో నిర్వహించిన సంగీత కచేరీలో అడ్మిరల్ లూత్రా తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ వీడియో 2019 సంవత్సరానికి చెందినదైనప్పటికీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు వేలల్లో లైక్స్‌, కామెంట్లు వస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన త‌ల్లే ఇలా..

Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చ‌నిపోయిన‌ట్లు న‌టించి..

Published on: Nov 18, 2022 09:32 AM