సముద్రం అడుగున అద్భుత దృశ్యం.. చూస్తే కళ్లు జిగేల్..
సముద్రంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలూ ఉన్నాయి. వాటిని కనుగొనేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రహస్యాల అన్వేషణలో పరిశోధకులు సముద్రంలో కొన్ని వందల, వేల కిలోమీటర్ల మేర నీటిలోకి వెళ్లారు.
సముద్రంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలూ ఉన్నాయి. వాటిని కనుగొనేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రహస్యాల అన్వేషణలో పరిశోధకులు సముద్రంలో కొన్ని వందల, వేల కిలోమీటర్ల మేర నీటిలోకి వెళ్లారు. ఈ క్రమంలో వారికి ఓ జెల్లీ ఫిష్ దర్శనమిచ్చింది. తాజాగా.. ఈ జెల్లీ ఫిష్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేకమైన జెల్లీ ఫిష్ నీలం రంగులో ఉంది. ఇవి ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అది చూడ్డానికి తలపైన ధరించే అందమైన క్యాప్‌లా ఉంది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరంలో సముద్రానికి 4,000 అడుగుల దిగువన ఈ జెల్లీ ఫిష్ కనిపించింది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో ‘హౌ థింగ్స్ వర్క్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ జెల్లీ ఫిష్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిన కానిస్టేబుల్.. వెంటనే..
ఓపెన్ గంగ్నమ్ స్టయిల్ అంటూ.. ఓపెన్ అయిపోయిన అమ్మాయి.. ఏం చేసిందో చూడండి !!