Viral Video: పెద్దపల్లి జిల్లాలో మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. చూసేందుకు క్యూ కట్టిన జనాలు.. వీడియో

|

Oct 05, 2021 | 8:47 AM

పెద్దపల్లి జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు వింత చేప చిక్కింది. మునుపెన్నడూ చూడని ఆ చేపను చూసి మత్స్యకారులే కాదు స్థానికులూ ఆశ్చర్యపోతున్నారు.

పెద్దపల్లి జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు వింత చేప చిక్కింది. మునుపెన్నడూ చూడని ఆ చేపను చూసి మత్స్యకారులే కాదు స్థానికులూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత వరకు ఇలాంటి చేప చూడలేదని మత్స్యకారులు అంటున్నారు.. ఇలాంటి చేపను చూడడం ఆశ్చర్యంగానే కాదు ఆనందంగా కూడా ఉందంటున్నారు..వింత చేపను చూడడానికి చుట్టుపక్కల జనం పెద్ద సంఖ్యలో మత్స్యకారుని ఇంటికి క్యూ కట్టారు. గతంలో జగిత్యాల జిల్లాలో కూడా ఓ మత్స్యకారుడికి ఇలాంటి చేపే చిక్కింది. ఈ అరుదైన చేపకు సంబంధించిన వివరాలను జిల్లా మత్య్సశాఖ అధికారులు తెలిపారు. దీనిని డెవిల్ ఫిష్‌ అంటారని… ఇవి ఎక్కువుగా సముద్రంలో ఉంటాయని చెప్పారు..మన తెలంగాణలోని వాగుల్లో దొరకడం చాలా అరుదు అని అంటున్నారు..ఎగువన కురిసిన వర్షాలకు కాలువల ద్వారా వచ్చిఉండొచ్చని తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: వైరల్‌గా ఫుడ్‌ ఛాలెంజ్‌.. 20 నిమిషాల్లో లాగించండి 20 వేలు గెలవండి! వీడియో

Viral Video: అతి పొడవైన చెవులతో గిన్నిస్ రికార్డు కొట్టింది.. వీడియో