తలను భూమిలో పెట్టి.. ఆపై మట్టిని కప్పి.. బుక్కెడు బువ్వ కోసం.. వీడియో
కరోనా కష్టకాలంలో మారిన పేదల బతుకు చిత్రానికి ఉదాహరణ ఈ స్టోరీ. ఒడిశా తెగ ప్రజలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమకు తెలిసిన విద్య ప్రదర్శిస్తూ పొట్ట నింపుకుంటున్నారు.
కరోనా కష్టకాలంలో మారిన పేదల బతుకు చిత్రానికి ఉదాహరణ ఈ స్టోరీ. ఒడిశా తెగ ప్రజలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమకు తెలిసిన విద్య ప్రదర్శిస్తూ పొట్ట నింపుకుంటున్నారు. ముండపోత కేల తెగ ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వారని చెబుతుంటారు. బతుకుదెరువు కోసం కొన్ని దశాబ్దాల క్రితం ఒడిశాకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు ఒక గ్రామంలో స్థిరపడకుండా సంచార జీవనం చేస్తుంటారు. గ్రామాలు తిరుగుతూ జీవనోపాధి పొందుతుంటారు. ముండపోత కేల తెగలకు చెందిన వారు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కడుపు నింపుకుంటున్నారు. గ్రామ సరిహద్దుల్లో లేదా గ్రామాల్లో ఏటవాలుగా మట్టిని తవ్వి, అందులో వారి తలను పెడతారు. ఆ తర్వాత తలను మట్టితో కప్పి ఉంచుతారు. కొన్ని నిమిషాల పాటు వారు అలాగే ఉండిపోతారు. తమ శ్వాసపైనే దృష్టి పెట్టి అలా ఉండిపోతారు. వారి ధైర్యసాహసాలు, ప్రదర్శనకు మెచ్చి.. గ్రామస్తులు కొంత ఆర్థిక సాయం చేస్తూ, బియ్యం, కూరగాయలు ఇస్తుంటారు. దాంతో వారు కడుపు నింపుకొని జీవనం సాగించడం అలవాటుగా మారిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పెద్దపల్లి జిల్లాలో మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. చూసేందుకు క్యూ కట్టిన జనాలు.. వీడియో
వైరల్‌గా ఫుడ్ ఛాలెంజ్.. 20 నిమిషాల్లో లాగించండి 20 వేలు గెలవండి! వీడియో