వీడే నా తమ్ముడు.. చిరుతకు రాఖీ కట్టిన మహిళ వీడియో
రాఖీ పండుగ అంటే అన్నా తమ్ములకు అక్కా చెల్లెళ్ళు రాఖీ కడుతుంటారు. సోదరుడికి సోదరి రక్ష సోదరికి సోదరుడు రక్ష అని చెప్పుకొని ఈ పండుగ వేళ ఒక మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఒక గ్రామీణ మహిళ చిరుతపులికి రాఖీ కట్టి ఆ చిరుతపులిని రక్షించమని కోరుతుంది.
వీడియోలో ఒక మహిళ తన ఇంటి సమీపంలోని పొలం దగ్గర కూర్చుని ఉంటుంది. ఆమె ముందు ఒక చిరుతపులి కూడా ప్రశాంతంగా కూర్చుని కనిపిస్తుంది. ఆ మహిళ దాని పాదాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని రాఖీ కట్టి దానికి స్వీట్లు తినిపించడానికి ప్రయత్నిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె రాఖీ కడుతుంటే ఆ చిరుతపులి కూడా మనిషిలాగా తన కాలిని ఇచ్చి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. రాజస్థాన్లో ఒక గ్రామంలో గత కొన్ని రోజులుగా చిరుతపులి తిరుగుతుంది. ఈ చిరుతపులి మనుషులకు భయపడదని గ్రామంలో చాలా సార్లు సంచరిస్తూ కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే చిరుతపులి ప్రమాదకరమైనదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. అడవి జంతువుల నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. రాఖీ కట్టే దృశ్యం భావోద్వేగంగా అనిపించిన చాలా ప్రమాదకరమని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ వీడియోలో కనిపిస్తున్న చిరుతపులి బలహీన స్థితిపై చాలామంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు చిరుతకు ఆమె ఏమైనా మందు మని ఇచ్చిందా లేదా అది అనారోగ్యంతో ఉందా అని అడుగుతున్నారు. అడవి జంతువుల పట్ల నిజమైన ప్రేమ మంచిదే కానీ అవి అడవుల్లో స్వేచ్ఛగా ఉండడమే మంచిదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :