బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే

Updated on: Jan 06, 2026 | 7:22 PM

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బాక్స్‌లో ఉన్న పసికందు మిస్సింగ్ కలకలం సృష్టించింది. తన బిడ్డకు పాలు ఇవ్వనివ్వడం లేదన్న అపోహతో తల్లే పసికందును తీసుకెళ్లిందని తర్వాత తెలిసింది. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆశావర్కర్ సహకారంతో తల్లి బిడ్డను గుర్తించి రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. అపోహలు తొలగిపోయి, తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారు.

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బాక్స్‌లో ఉంచిన పసికందు మిస్సింగ్‌ కలకలం రేపింది. అయితే ఆ పసికందును తల్లే ఎత్తుకొని పారిపోయిందని తెలిసి అంతా షాకయ్యారు. పోలవరం జిల్లా దేవీపట్నంకు చెందని కత్తుల బాపనమ్మ 14 రోజుల క్రితం డెలివరీ నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. డెలివరీ అయిన తర్వాత పసికందును బరువు తక్కువగా ఉండటంతో బాక్స్‌లో ఉంచారు. అయితే తల్లి తన బిడ్డకు పాలు కూడా ఇవ్వనివ్వడంలేదని భావించిన ఆ తల్లి పసికందును తీసుకొని తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. ఉదయం ఆస్పత్రి సిబ్బంది బాక్స్‌లో పసికందు లేకపోవడం చూసి అంతా వెతికారు. వార్డులో తల్లి కూడా లేకపోవడంతో కంగారు పడిన సిబ్బంది ఆస్పత్రి సూపరింటెండెంట్‌కి తెలుపగా ఆయన రాజమండ్రి త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాపనమ్మ తన బిడ్డను తీసుకొని స్వగ్రామానికి చేరడంతో స్థానిక ఆశావర్కర్‌ గుర్తించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. తల్లితోపాటు పిల్లవాడిని తిరిగి తీసుకుని వెళ్లి రంపచోడవరం ఏరియా హాస్పిటల్ లో చేర్చినట్లు తెలిసిందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. సత్యనారాయణ తెలిపారు. అయితే తన బిడ్డ వద్దకు కనీసం పాలు ఇవ్వడానికి కూడా వెళ్ళనివ్వడం లేదన్న ఉద్దేశంతోనే తన బిడ్డను తీసుకుపోయానని చెబుతుంది పసిబిడ్డ తల్లి. అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరినీ వైద్యులు ఆసుపత్రికి తరలించారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు

పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి

టీ20 ప్రపంచకప్‌‌లో ఊహించని మార్పులు.. భారత్‌లో ఆడలేమంటున్న బంగ్లాదేశ్

తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి

TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం