Raino vs Deer: ఇదేం వర్గ పోరు.. రైనోనే పరుగులు పెట్టించిన దుప్పి.. వైరల్ అవుతున్న వీడియో..
ఓ పార్క్‌లో నీటి మడుగు ఉంది. అక్కడికి నీళ్లు తాగుదామని ఓ ఆంటిలోప్ వచ్చింది. ఇంతలో అక్కడికి ఓ రైనో వచ్చింది. ఆ ఆంటిలోప్‌పై దాడి చేసే ప్రయత్నం చేసింది.
ఓ పార్క్‌లో నీటి మడుగు ఉంది. అక్కడికి నీళ్లు తాగుదామని ఓ ఆంటిలోప్ వచ్చింది. ఇంతలో అక్కడికి ఓ రైనో వచ్చింది. ఆ ఆంటిలోప్‌పై దాడి చేసే ప్రయత్నం చేసింది. తన ఒంటి కొమ్ముతో ఆంటిలోప్‌ను కుమ్మే ప్రయత్నం చేసింది. అయితే ఆంటీలోప్ ఏమాత్రం భయపడకుండా తన పదునైన కొమ్ములతో రైనో పై అటాక్ చేసింది. ఎదుట ఉన్న భారీ రైనోను భయపెట్టింది. దానిని తరిమికొట్టింది. ఇంతలో మరోవైపు నుంచి ఇంకో 3 రైనోలు ఆంటిలోప్‌పై అటాక్ చేసేందుకు వచ్చాయి. వీటిని సైతం తన మనోబలంతో ధీటుగా ఎదుర్కొంది. మోకాళ్లపై కూర్చుని వాటిని తన కొమ్ములతొ కుమ్ముతూ తరిమి తరిమి కొట్టింది. చూడటానికి చిన్న సైజులో ఉన్నా.. దాని ధైర్యం ముందు పెద్ద పెద్ద రైనోలే జడుసుకుని పోవడం నిజంగా ఆశ్చర్యమే. ఈ షాకింగ్ సీన్‌ను కొందరు పర్యాటకులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..