వేలమంది ప్రయాణీకుల ప్రాణాలతో లోకోపైలెట్ల చెలగాటం

|

May 27, 2024 | 8:56 PM

పరిమితికి మించిన వేగంతో రైళ్లను నడిపి ప్రయాణికులను ప్రమాదపు అంచుల వరకూ తీసుకెళ్లిన లోకోపైలట్లపై రైల్వే శాఖ వేటు చేసింది. గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్ రైళ్ల లోకోపైలట్లను ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆగ్రా కంటోన్మెంట్‌కు సమీపంలోని జజువా, మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వంతెనపై రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని రైల్వే అధికారులు నిర్దేశించారు.

పరిమితికి మించిన వేగంతో రైళ్లను నడిపి ప్రయాణికులను ప్రమాదపు అంచుల వరకూ తీసుకెళ్లిన లోకోపైలట్లపై రైల్వే శాఖ వేటు చేసింది. గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్ రైళ్ల లోకోపైలట్లను ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆగ్రా కంటోన్మెంట్‌కు సమీపంలోని జజువా, మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వంతెనపై రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని రైల్వే అధికారులు నిర్దేశించారు. అయితే, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఇటీవల ఈ వంతెనపై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ తరువాత మరో రెండు మూడు రోజులకు మాల్వా ఎక్స్‌ప్రెస్ కూడా పరిమితికి మించిన వేగంతో ప్రయాణించింది. అయితే, ముందస్తు హెచ్చరికల గురించి సహాయక లోకోపైలట్‌కు గట్టిగా చెబుతారని, వాటిని లోకోపైలట్ తిరిగి చెప్పే విధానం ఉంటుందని రైల్వే అధికారులు అన్నారు. అయినా కూడా ఈ తప్పిదం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వంతెనపై రైలు నెమ్మదిగా నడపాల్సిన విషయాన్ని వారు మర్చిపోయినట్టు కనిపిస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే, వందలాది మంది ప్రయాణికులను ప్రమాదం అంచుల వరకూ తీసుకెళ్లిన నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు దశాబ్దాల తర్వాత పూరి – నాగ్ కాంబినేషన్లో మరో సినిమా..

Lakshmi Manchu: ట్రోల్స్‌ చూసి బాధేసింది.. మంచు లక్ష్మీ ఎమోషనల్

హేమ నోరు విప్పితే అంతే.. టెన్షన్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీస్‌

Kalki 2898 AD: ఇది కార్‌ కాదు.. బుజ్జి డైనోసార్‌ !! ప్రత్యేకలు తెలిస్తే షాకే!

Follow us on