Inspection Coach: రైలు ఇన్‌స్పెక్షన్‌ కోచ్‌ను తోసుకుంటూ వెళ్లిన సిబ్బంది.! వీడియో.

రైలు మార్గాలను తనిఖీ చేయడానికి వాడే స్వయంచాలిత ‘ఇన్‌స్పెక్షన్‌ కారు’ మొరాయించడంతో సిబ్బంది దానిని తోసుకుంటూ వెళ్లిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం సుల్తాన్‌పుర్‌ నుంచి నిహాల్గడ్‌ వరకు వెళ్తున్న ఈ తేలికపాటి కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో వేరే రైలు రాబోతుండడంతో అక్కడి లెవెల్‌ క్రాసింగ్‌ను అప్పటికే మూసి ఉంచారు.

Inspection Coach: రైలు ఇన్‌స్పెక్షన్‌ కోచ్‌ను తోసుకుంటూ వెళ్లిన సిబ్బంది.! వీడియో.

|

Updated on: Mar 25, 2024 | 8:58 AM

రైలు మార్గాలను తనిఖీ చేయడానికి వాడే స్వయంచాలిత ‘ఇన్‌స్పెక్షన్‌ కారు’ మొరాయించడంతో సిబ్బంది దానిని తోసుకుంటూ వెళ్లిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం సుల్తాన్‌పుర్‌ నుంచి నిహాల్గడ్‌ వరకు వెళ్తున్న ఈ తేలికపాటి కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో వేరే రైలు రాబోతుండడంతో అక్కడి లెవెల్‌ క్రాసింగ్‌ను అప్పటికే మూసి ఉంచారు. ఇన్‌స్పెక్షన్‌ కారులో సమస్య ఏమిటనేది తెలియకపోవడం, దానిని లాక్కొని వెళ్లాలన్నా వేరే ఇంజిన్‌ అందుబాటులో లేకపోవడంతో రైళ్ల రాకపోకలకు అవాంతరం తలెత్తకుండా అధికారులు, సిబ్బంది నడుం బిగించి దీనిని తోసుకుంటూ వెళ్లారు. ప్రధాన లైను నుంచి లూప్‌లైన్‌లోకి వీరు దీనిని ఇలా పంపించిన దృశ్యం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిని నెట్టడానికి రైల్వే మంత్రినీ పిలవాల్సిందని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌ వ్యంగ్యాస్త్రం సంధించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు ఎన్నికల బాండ్ల నుంచి ఇంధనం అందినట్లు లేదని చురక అంటించారు. మోదీ సర్కారు హయాంలో రైల్వే సహా అన్ని రంగాలూ నాశనమయ్యాయని కాంగ్రెస్‌ విమర్శించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us