AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mass Copying Viral: ఓర్నీ వీడి క్రియేటివిటీ తగలయ్యా.! ఇదే మాస్ కాపీరా మావా.. చూస్తే ఫ్యూజులు ఔట్..

Mass Copying Viral: ఓర్నీ వీడి క్రియేటివిటీ తగలయ్యా.! ఇదే మాస్ కాపీరా మావా.. చూస్తే ఫ్యూజులు ఔట్..

Anil kumar poka
|

Updated on: Apr 15, 2022 | 9:19 PM

Share

పరీక్షల్లో కాపీ కొట్టేందుకు స్టూడెంట్స్ కొత్త కొత్త సాంకేతికత పద్దతులను విరివిగా వాడేస్తున్నారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఉపయోగించి మాస్ కాపీయింగ్



పరీక్షల్లో కాపీ కొట్టేందుకు స్టూడెంట్స్ కొత్త కొత్త సాంకేతికత పద్దతులను విరివిగా వాడేస్తున్నారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేస్తూ విద్యార్ధులు పట్టుబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ స్టూడెంట్ బోర్డు పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడి.. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఎలా పట్టుబడ్డాడో తెలుసా.?

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లీష్ పరీక్ష మొదలైన కాసేపటికి ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చింది. ప్రతీ క్లాస్ రూమ్‌ను సెర్చ్ చేయగా.. పరీక్ష రాస్తున్న విద్యార్ధుల్లో ఒకరి కదలికలు కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు అధికారులు. ఇక కాపీయింగ్ కోసం ఆ స్టూడెంట్ ఏం చేశాడో చూసి అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ విద్యార్ధి తన పేపర్ ప్యాడ్‌లోనే మొబైల్ ఫోన్ అమర్చాడు. ఇక మొబైల్ బయటకి తీసి చెక్ చేయగా.. అందులో టెక్ట్‌ బుక్‌ ఫొటోలు వాట్సాప్‌ షేర్ చేసినట్లు కనిపించాయి. ఇలా కాపీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన విద్యార్ధి నుంచి అధికారులు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సదరు విద్యార్ధిని డిబార్ చేశారు. ప్రస్తుతం ఈ తతంగానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ పరీక్షలో మరికొంతమంది స్టూడెంట్స్‌ కూడా కాపీ కొడుతూ దొరక్కగా.. వారిపైనా అధికారులు చర్యలు తీసుకున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!