ఏడాదిగా కోమాలో కొడుకు.. ఆలయం ముందు పడుకోబెటిన తండ్రి.. కట్ చేస్తే
రాజస్థాన్‌కు చెందిన ప్రకాష్ భోయ్ కుమారుడు నిఖిల్ ఏడాదిగా కోమాలో ఉన్నాడు. వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేయగా, తండ్రి పూరీ జగన్నాథ ఆలయం వద్ద బిడ్డను పడుకోబెట్టి ఏడాదిపాటు భక్తితో ప్రార్థించాడు. అద్భుతంగా, బాలుడు కాళ్ళు, చేతులు కదపడం మొదలుపెట్టాడు. ఇది దైవ సంకల్పంగా భక్తులు నమ్ముతున్నారు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని కటక్ శిశు భవన్‌కు తరలించారు.
సంవత్సరానికి పైగా ఆ బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతో మంది డాక్టర్లకు చూపించాడు తండ్రి. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక చేసేదేం లేక .. కోమాలో ఉన్న కుమారుడిని తను భక్తితో కొలిచే పూరి జగన్నాథుడి ఆలయం సింహద్వారం ముందు పడుకోబెట్టాడు. ఇక నువ్వే పిల్లవాడిని బతికించాలని వేడుకున్నాడు. ఆ తండ్రి పడుతున్న వేదనకు కరిగిపోయిన భగవంతుడు కోమాలో ఉన్న 8 ఏళ్ల బాలుడిలో కదలిక తీసుకొచ్చాడని ఇప్పుడు అంతా నమ్ముతున్నారు. ఇది ఒడిశా పూరీలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్ భోయ్ అనే వ్యక్తికి నిఖిల్ అనే 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే సంవత్సర కాలంగా నిఖిల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలా కాలంగా స్పృహ కోల్పోయి అచేతనంగా మిగిలిపోయాడు. ఆ బాలుడి ఆరోగ్యం కుదుటపడి, తిరిగి ఆరోగ్యవంతుడు కావాలని..బాలుడి తండ్రి ప్రకాశ్ ఎన్నో ఆసుపత్రులకు తిప్పాడు. కానీ, అక్కడి డాక్టర్లంతా తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ఇక చేసేది ఏమీ లేక తాను ఎక్కువ గా కొలిచే దైవాన్ని తలుచుకున్నాడు. వెంటనే ఒడిశాలోని పూరీకి తీసుకెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న తన కుమారుడిని పూరీ జగన్నాథుడి ఆలయపు ప్రధాన ప్రాకారం ముందు పడుకోబెట్టాడు. రోజంతా స్వామి నామం జపిస్తూ.. ఎలాగైనా తన కుమారుడిని మునుపటి మనిషిని చేయాలని కన్నీటితో ప్రార్థించాడు. ఇలా ఏడాది గడిచాక.. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు నిఖిల్ ఒక్కసారిగా కాళ్లు, చేతులు ఆడించడం మొదలు పెట్టాడు. అంతే ఇక ఆ తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఆ స్వామి వద్దకు వెళ్లి తన కొడుకును బతికించాడని నమ్ముతూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి భక్తులు, ఆలయ సిబ్బంది జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అంబులెన్స్ పంపి, బాలుడిని ఆలయ ప్రాంగణం నుంచి పూరీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం వైద్యులు అతన్ని కటక్ శిశు భవన్‌కు పంపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మ హత్య
పదోతరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ఇదే
Tomato Price: బంగారంతో పోటీపడుతున్న టమాటా.. బాబోయ్.. ఏంటి ఆ ప్రైజ్
వామ్మో.. దుకాణం ముందు పిండిబొమ్మ, కోడిగుడ్లు.. వణికిపోతున్న బస్తీ వాసులు
చికెన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. రూపాయికే అరకేజీ చికెన్.. కండిషన్స్ అప్లై
