Puppies – Hen: కోడి పొత్తిళ్లలో ఆశ్రయం పొందిన కుక్క పిల్లలు.. షాకింగ్ వీడియో..!
సృష్టిలో అమ్మతనానికి మించిన దైవం మరొకటి లేదు. అనంతకోటి జీవరాశుల్లో జాతి వైరం సహజం. కుక్కకు కోడికి పడదు. ఇందులో ప్రేమాభిమానాలకు తావుండదు. అయితే ..
తాజాగా రెండు కుక్క పిల్లల పెంపుడు తల్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్లలను కోడి తన రెక్కల కింద పెట్టుకుని వెచ్చదనాన్ని ఇచ్చింది. కుక్కలకు కోడి కనిపిస్తే దానిని చంపి తినే వరకూ ఆగలేవు. అలాంటిది రెండు కుక్క పిల్లలకు ఒక కోడి ఆశ్రయం కల్పించడమా..? అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ నమ్మక తప్పదు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక కోడి తన పిల్లలతో పాటు రెండు కుక్క పిల్లలను తన పొత్తిళ్లలో తన రెక్కల కింద దాచుకుంది. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో కోడిపుంజు.. కోడి కింద నుంచి బయటకు వస్తున్న కుక్కపిల్లలను చూసి ఆశ్చర్యపోయింది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
