Harassment: 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులు.. నెలన్నర తర్వాత కేసు నమోదు

|

Nov 05, 2023 | 9:34 AM

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపల్‌ కీచకుడయ్యాడు. స్కూల్‌లోని సుమారు 50 మంది విద్యార్థినుల పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం జింద్‌ జిల్లాలో జరగగా ఈ ఘటనపై విద్యార్థినిలే స్వయంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. జింద్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపల్‌ కీచకుడయ్యాడు. స్కూల్‌లోని సుమారు 50 మంది విద్యార్థినుల పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం జింద్‌ జిల్లాలో జరగగా ఈ ఘటనపై విద్యార్థినిలే స్వయంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. జింద్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్వయంగా బాధితులే ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయంలో పోలీసుల అలసత్వం ప్రదర్శించడం పట్ల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యార్థినుల ఫిర్యాదులను తాము సెప్టెంబర్‌ 14న పోలీసులకు పంపినట్లు తెలిపింది. అయితే అక్టోబర్‌ 30న చర్యలు తీసుకున్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఫిర్యాదు చేసిన నెలన్నర తర్వాత ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా మాట్లాడుతూ.. ప్రిన్సిపల్‌పై విద్యార్థినుల నుంచి తమకు 60 లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయని వీటిలో 50 మంది విద్యార్థినులు నేరుగా ప్రిన్సిపల్‌ చేతిలో శారీరక వేధింపులకు గురైన వారే అన్నారు. మరో పది మంది అమ్మాయిలు ప్రిన్సిపల్ లైంగికంగా వేధిస్తారని తమకు తెలుసునని తమ ఫిర్యాదులో పేర్కొన్నారని ఆమె అన్నారు. ఫిర్యాదు చేసిన వారంతా మైనర్లని భాటియా తెలిపారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై భాటియా మండిపడ్డారు. కొంతమంది విద్యార్థినుల నుంచి సెప్టెంబర్ 13న ఫిర్యాదును స్వీకరించినట్లు చెప్పారు. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్‌ 14న పోలీసులకు ఫార్వర్డ్ చేసినట్లు చెప్పారు. అయితే, సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 29 వరకు వారు ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.