Meghan viral video: పెద్దస్థాయిలో ఉండికూడా ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చిన మేఘన్.. వైరల్‌గా మారిన వీడియో..

|

Sep 21, 2022 | 11:17 AM

బ్రిటన్ రాణి ఎలిజబెత్ కు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్‌సోర్ కాస్టిల్‌కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్‌, మరో మనవడు ప్రిన్స్ విలియమ్,


బ్రిటన్ రాణి ఎలిజబెత్ కు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్‌సోర్ కాస్టిల్‌కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్‌, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్‌ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు.అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్‌ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లను ఆకట్టుకుంది. వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది. ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్‌.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 21, 2022 11:17 AM