Police: కస్టడీలోని వ్యక్తులతో బలవంతంగా శృంగారం చేయించిన పోలీసులు..!
పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాది, మరో వ్యక్తిని కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. ఇదే ఆరోపణలతో ఎస్పీ, మరో ఇద్దరు పోలీసులపై వేటు పడింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం సీరియస్ అయ్యారు. లూథియానా పోలీస్ కమిషనర్ మన్‌దీప్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాది, మరో వ్యక్తిని కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. ఇదే ఆరోపణలతో ఎస్పీ, మరో ఇద్దరు పోలీసులపై వేటు పడింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం సీరియస్ అయ్యారు. లూథియానా పోలీస్ కమిషనర్ మన్‌దీప్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 14న ఓ న్యాయవాదిని మరొక వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. పోలీసు బృందంపై న్యాయవాదులు దాడి చేసి యూనిఫామ్ లను చించివేశారని ఆరోపించారు. అయితే తమ కస్టడీలో ఉన్న న్యాయవాదిని చిత్రహింసలకు గురిచేసినట్టు ఎస్పీ-ర్యాంక్ అధికారితో సహా ఆరుగురు పోలీసులపై అభియోగాలు మోపారు ఆ న్యాయవాదులు. సహ నిందితుడితో లైంగిక చర్యల్లో పాల్గోవాలని ఆ లాయర్ ను బలవంతం చేసినట్టు ఆరోపించారు. ముక్త్‌సర్ ఇన్వెస్టిగేషన్ ఎస్పీ రమణదీప్ సింగ్ భుల్లర్, ఇన్‌స్పెక్టర్ రమణ్ కుమార్ కాంబోజ్, కానిస్టేబుళ్లు హర్బన్స్ సింగ్, భూపీందర్ సింగ్, గురుప్రీత్ సింగ్, హోంగార్డు దారా సింగ్‌లపై ఈ మేరకు కేసు నమోదైంది. వీరిలో ఎస్పీ భుల్లర్, ఎస్ఐ రమణ్ కుమార్, కానిస్టేబుల్ హెర్బన్స్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. మరోవైపు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో పంజాబ్ హరియాణా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. మిగిలిన పోలీసులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..