Viral Video: డీజే టిల్లు పాటకు పోలీసుల డ్యాన్స్‌ అదిరిందిగా

|

May 28, 2024 | 12:13 PM

ఎప్పుడూ కంటి మీద కునుకు లేకుండా బిజీగా గడిపే పోలీసులు ఆటపాటలతో అదరగొట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సంబరాల్లో మునిగిపోయారు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే సహా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది అంతా కలిసి డ్యాన్సులు వేశారు. ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తూ, సక్సెస్ మీట్ జరుపుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు జిల్లా పోలీసులు.

ఎప్పుడూ కంటి మీద కునుకు లేకుండా బిజీగా గడిపే పోలీసులు ఆటపాటలతో అదరగొట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సంబరాల్లో మునిగిపోయారు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే సహా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది అంతా కలిసి డ్యాన్సులు వేశారు. ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తూ, సక్సెస్ మీట్ జరుపుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు జిల్లా పోలీసులు. ఇల్లందు గెస్ట్ హౌస్ లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ కారే సహా పోలీస్ అధికారులు సిబ్బంది అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గానా భజానాలో మునిగి తేలారు. డీజే పాటలకు పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి భూపాలపల్లి ఎస్పీ స్టెప్పులు వేశారు. ఈ జిల్లాకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఉంటుంది. ఎన్నికలకు ముందు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించారు. ఒక్క సంఘటన కూడా జరగకుండా పోలింగ్ ముగియడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. వారితో సరదాగా మాట్లాడుతూ ఆటపాటల్లో మునిగి తేలారు జిల్లా ఎస్సీ కిరణ్ కారే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాయిస్‌ మార్ఫింగ్‌ యాప్‌తో వల.. ఏడుగురిపై లైంగికదాడి

5 నిమిషాల ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు

TOP 9 ET News: దీపిక తీరుతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం | పోలీసులకు హేమ బిగ్ ఝలక్‌

హీరోయిన్‌ను దారుణంగా చంపిన తండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు

Aaradhyadevi: అందం వెనక ఆవేదనను, కష్టాన్ని చెప్పుకొని ఇన్‌స్టా బ్యూటీ ఎమోషనల్

 

Follow us on