Snake Viral Video: విష సర్పాలతో విన్యాసాలు.. అక్కడ వినూత్నంగా నాగపంచమి వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో.
నాగు పాములను హిందువులు దేవతాస్వరూపంగా కొలుస్తారు. నాగపంచమి, నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి ఇలా రకరకాల పేర్లతో వేడుకలు నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో పూజిస్తారు..
నాగు పాములను హిందువులు దేవతాస్వరూపంగా కొలుస్తారు. నాగపంచమి, నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి ఇలా రకరకాల పేర్లతో వేడుకలు నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.. పుట్టలో పాలుపోస్తారు.. ప్రత్యేకమైన నైవేద్యాలు చెల్లిస్తారు. తాజాగా బీహార్‌లో వినూత్నంగా నాగపంచమి వేడుకలు నిర్వహించారు.
సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్‌చాక్ మండలం ఆగాపుర్ గ్రామస్థులు మాత్రం ఇందుకు భిన్నంగా నాగదేవతను ఆరాధిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా.. భగత్ అని పిలువబడే కొందరు పూజారులు గ్రామంలోని ఓ నీటి కుంట నుంచి పాములను బయటకు తీస్తారు. వాటితో విన్యాసాలు చేస్తారు. మెడకు చుట్టుకొని ఆడిస్తారు. అయితే అవి సాధారణ సర్పాలే అనుకుంటే పొరబాటే.. అవి అత్యంత విషపూరితమైనవి. అయినా పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా భక్తి పారవశ్యంతో ఇవేవీ సాధారణ సర్పాలా అంటే కాదు. చాలా వరకు విషపూరితమైనవే. అయినా బెదరకుండా భక్తి శ్రద్ధలతో వాటిని మెడలో ధరించి విన్యాసాలు చేస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..