Snake in Man Dress: ఏం గుండెరా సామీ.. భారీ పామును ఎంచెక్కా లుంగీలో వేసుకుని..! వీడియో వైరల్..
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. వాటి పేరు వింటేనే చాలామంది కంగారు పడిపోతారు. ఇక అనుకోకుండా ఎప్పుడైనా విష సర్పాలు తారసపడితే అంతే సంగతులు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. వాటి పేరు వింటేనే చాలామంది కంగారు పడిపోతారు. ఇక అనుకోకుండా ఎప్పుడైనా విష సర్పాలు తారసపడితే అంతే సంగతులు. క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతారు. బతికున్న పాముల సంగతి పక్కన పెడితే.. కనీసం చనిపోయిన పాముల దగ్గరికి కూడా వెళ్లరు చాలామంది. ప్రపంచంలో 2 వేలకు పైగా జాతుల పాములు ఉన్నాయంటారు. అయితే అన్నీ పాములు విషపూరితమైనవి కావు. కొన్ని పాముల్లో మాత్రమే విషం ఉందని, అలాంటి పాములకు దూరంగా ఉండటం మంచిది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి విషపూరిత పాముతో ఆడుకోవడమే కాకుండా, ఏ మాత్రం భయంలేకుండా లుంగీలో వేసుకుని హాయిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇది గతంలో జరిగిన సంఘటన అయినప్పటికీ.. ఓ వ్యక్తి తిరిగి ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. సదరు వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos