Ayodhya: శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్యకు రేగు పండ్లు.!

|

Jan 22, 2024 | 10:34 AM

అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణ సమయం ఆసన్నమవుతోంది. ఇక కొద్ది గంటల్లోనే భవ్య రామమందిరం ప్రారంభం అవుతోంది. బాలరాముడు భక్తులకు తన దివ్యమంగళస్వరూపంతో దర్శనమివ్వనున్నాడు.. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి రేగు పళ్లను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు.

అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణ సమయం ఆసన్నమవుతోంది. ఇక కొద్ది గంటల్లోనే భవ్య రామమందిరం ప్రారంభం అవుతోంది. బాలరాముడు భక్తులకు తన దివ్యమంగళస్వరూపంతో దర్శనమివ్వనున్నాడు.. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి రేగు పళ్లను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన 17 మంది ఈ పండ్లను రామ మందిర ట్రస్టు వారికి అందించారు. శ్రీరాముడి మాతామహులు..శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన వారని స్థానికుల విశ్వాసం. వనవాసం సమయంలో శ్రీరాముడు.. లక్షణసీతా సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భక్త శబరి మొదట తాను రుచి చూసిన రేగు పండ్లను.. స్వామికి ఇచ్చిందని కూడా అక్కడి వారు నమ్ముతారు. ఈ నేపథ్యంలో స్థానికులు స్థానికంగా లభించే తీపి రేగు పళ్లను కానుకగా స్వామివారికి సమర్పించారు. తీపి రేగు పళ్లతో పాటూ శివ్రీనారాయణ్ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఓ ప్రత్యేక మొక్కను కూడా తీసుకొచ్చామని.. ఈ మొక్క ఆకులు చిన్న గిన్నె ఆకారంలో ఉంటాయని. శబరి ఈ ఆకులోనే రేగు పళ్లను పెట్టి శ్రీరాముడికి అందించింది’’ అని అనూప్ యాదవ్ అనే భక్తుడు తెలిపారు. అయోధ్యలో కూడా ఈ మొక్కలు నాటాలని తాము రామమందిర ట్రస్టుకు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. మరోవైపు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణ పుస్తకాన్ని కానుకగా ఇచ్చేందుకు వచ్చామని మనోజ్ సాటీ అనే భక్తుడు తెలిపారు. ఈ రామాయణం ఖరీదు సుమారు 1.65 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. పుస్తకం డిజైన్, పేపర్ అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos