కుక్కల కోసం స్పెషల్‌ ఊయల.. కిర్రాక్‌ ఐడియా..

|

Jun 03, 2023 | 9:46 PM

సోషల్ మీడియా అనేది నిజంగా ఓ వింత ప్రపంచం. కనీవినీ ఎరుగని విషయాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పెట్ లవర్ తన పెట్స్‌ని ఎలా ఆడించాడో చూస్తే ఆశ్చర్యపోవాలిసిందే..

సోషల్ మీడియా అనేది నిజంగా ఓ వింత ప్రపంచం. కనీవినీ ఎరుగని విషయాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పెట్ లవర్ తన పెట్స్‌ని ఎలా ఆడించాడో చూస్తే ఆశ్చర్యపోవాలిసిందే.. సాధారణంగా ఏ పెట్ లవర్ అయినా తమ పెట్స్‌ని సరదాగా ఎత్తుకోవడం, బయటకు తీసుకెళ్లి ఆడించడం, వాటికి ఇష్టమైనవి తినిపించడం, ఇవ్వడం వంటివి చేస్తారు. కానీ వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం అలా జరగలేదు. సదరు పెట్ లవర్ తను పెంచుకునే రెండు పెంపుడు కుక్కలను ఉయ్యాలలో వేసి ఊపాడు. అది కూడా మామూలు ఉయ్యాల అనుకుంటే పొరపాటే.. అవి పడిపోకుండా భారీ సైజులో ఉన్న రెండు ఖాళీ పుచ్చకాయలను సేకరించి, వాటిల్లో రెండు కుక్కల కింద కాళ్లు దూరేలా రంధ్రాలు చేశాడు. ఆ తర్వాత పుచ్చకాయలను చెట్టు కొమ్మకు వేలాడదీసి.. తన పెంపుడు కుక్కలను వాటిల్లో కూర్చొబెట్టాడు. అంతే అవి కూడా ఎంతో సంతోషంగా ఉయ్యాలను ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్క సారిగా షాక్. ముందెన్నడూ చూడని దృశ్యం కళ్లెదురుగా ఉంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే కదా.. కాగా ఈ వీడియోను 45 వేలమందికి పైగా లైక్‌ చేశారు. అయితే వీడియో కామెంట్ సెక్షన్ ఎనేబుల్‌లో లేదు కానీ.. లేకపోతే కామెంట్లతో హోరెత్తించేవారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ రాయిని మండించండి.. వైఫై సిగ్నల్‌ తన్నుకుంటూ వస్తుంది

30 లక్షలమందిని ఇంప్రెస్‌ చేసిన దోశ.. తింటే వదలరు

యవ్వనం కోసం కోట్లు ఖర్చుచేయక్కర్లేదు.. కేవలం ఈ గదిలోకి వెళ్తే చాలు

35 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల.. ఆనందంతో తండ్రి..

Ram Charan: శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్‌ చరణ్‌ హంగామా..