Viral Video: తెలివైన కుక్క ఏం చేసిందో చూడండి.. మనుషులనే మించిపోయిందంటున్న నెటిజనం
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జంతువులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ శునకం చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జంతువులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ శునకం చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. ఓ యజమాని తన పెంపుడు శునకాన్ని రింగులో నిల్చొమని ఆదేశించాడు. తాను చెప్పే వరకు అక్కడి నుంచి కదలొద్దు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ కుక్కకు ఎదురుగా ఉన్న టేబుల్‌పై చికెన్ ముక్క ఉంది. చికెన్ చూడగానే శునకానికి నోరూరింది. ఓవైపు చికెన్ తినాలనే కోరిక, మరోవైపు యజమాని రింగ్ దాటకూడదని చెప్పిన ఆర్డర్‌ను జవదాటకూడదనే భయం. దీంతో ఆ శునకం ఓ సూపర్ ఐడియా వేసింది. మనుషులనే మించే తెలివి తేటలను ప్రదర్శించింది. సదరు రింగును నెమ్మదిగా టేబుల్ వరకు జరిపి ఎంచక్కా చికెన్‌ను లాగించేసింది.
Also Watch:
వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ చేసిన డాక్టర్లు !! అంత్యక్రియలకు ముందు స్నానం చేయిస్తుండగా షాక్ !!