Viral Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల వెల్లువ విపరీతంగా పెరిగిపోయింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ప్రతీ వివాహానికి సంబంధించిన పలు రకాల వీడియోలు ఈ రోజుల్లో నెట్టింట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా భావోద్వేగంతో ఉంటాయి. కన్నీళ్లను కూడా తెప్పించేలా ఉంటాయి. వైరల్ అవుతున్న ఈ పెళ్లి వీడియోను చూసి మీరు పగలబడి నవ్వుతారు.
ఈ వీడియో విషయానికి వస్తే.. వధూవరులు ఆలయం వెలుపల నేలపై కూర్చొని పూజలు చేస్తుంటారు. అతని కుటుంబంతోపాటు బంధువులు వారి చుట్టూ కూర్చున్నారు. అయితే కొందరు వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక వస్త్రం కోసం సరదాగా ఆధిపత్యం చెలాయించడం చూడొచ్చు. ఈ వస్త్రం కోసం ఇరువర్గాలు పోరాడుతుంటాయి. ఇంతలో కొందరు నేలమీద కూర్చున్న వధూవరుల మీద పడతారు. ఇది చూసి వధువు కూడా నవ్వడం ప్రారంభించింది. వధూవరులతో పాటు, అక్కడ ఉన్న వ్యక్తులు కూడా నవ్వులతో ఈ గేమ్‌ను ఎంజాయ్ చేశారు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో official_niranjanm87 అనే పేరుతో షేర్ చేయబడింది. సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియోను నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. ఈవీడియోను ఒకరితో ఒకరు పంచుకోవడమే కాకుండా దానిపై కామెంట్లు కూడా చేస్తున్నారు. కొంచెమైతే పెళ్లికూతురు నడుం విరిగిపోయేది అంటూ ఒకరు కామెంట్ చేయగా, వివాహంలో ఇలాంటి సరదాలు ఎన్నో ఉంటాయి అంటూ కామెంట్ చేశారు. ఇలాంటివి మాత్రమే గుర్తుండిపోయేలా చేస్తాయని మరికొంతమంది కామెంట్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.
Also Read: Viral Video: అదిరేటి స్టెప్పులతో అదరగొట్టిన పోలీస్.. ‘వావ్, వాటే’ గ్రేస్ అంటోన్న నెటిజన్స్