Viral: నువ్వు సూపర్.! అందుకో మా గిఫ్ట్.. గుర్రంపై ఫుడ్‌ డెలివరీబోయ్‌ పలువురు ఆర్ధికసాయం

|

Jan 08, 2024 | 11:56 AM

దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్లు, ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేపట్టడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా పెట్రోలు బంకుల వద్ద జనాలు బారులు తీరారు. ఇక ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ చేసే డెలివరీ బోయ్స్‌ కష్టాలు చెప్పనలవికాదు. దీంతో ఓ ఫుడ్‌ డెలివరీ బోయ్‌ గుర్రాన్ని ఆశ్రయించాడు. గుర్రంపై స్వారీ చేసుకుంటూ సకాలంలో ఫుడ్‌ ఆర్డర్లు డెలివరీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్లు, ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేపట్టడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా పెట్రోలు బంకుల వద్ద జనాలు బారులు తీరారు. ఇక ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ చేసే డెలివరీ బోయ్స్‌ కష్టాలు చెప్పనలవికాదు. దీంతో ఓ ఫుడ్‌ డెలివరీ బోయ్‌ గుర్రాన్ని ఆశ్రయించాడు. గుర్రంపై స్వారీ చేసుకుంటూ సకాలంలో ఫుడ్‌ ఆర్డర్లు డెలివరీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అతని నిబద్ధతకు మెచ్చి ఎందరో అతనిని మెచ్చుకొని ఆర్ధిక సాయం అందించారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని చంచల్‌గూడకు చెందిన మహ్మద్‌ ఫారూఖ్‌ తన బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడంతో బంక్‌ దగ్గరికి వెళ్లి దాదాపు 3 గంటలకుపైగా క్యూలో వేచిచూశాడు. ఎంతకీ పెట్రోల్‌ దొరకలేదు. దీంతో వినూత్నంగా ఆలోచించాడు. ఎలాగైనా ఫుడ్‌ను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో తన అన్న దగ్గరికి వెళ్లి బైక్‌ను అక్కడ పెట్టి సోదరుడి దగ్గర ఉన్న గుర్రాల్లో ఒకటి తీసుకుని రోడ్లపై పరుగులు పెట్టించాడు. వీపునకు జొమాటో బ్యాగ్‌ వేసుకుని ఎంచక్కా ఆర్డర్స్‌ను కస్టమర్లకు వేగంగా అందించాడు. రోడ్లపై జొమాటో బాయ్‌ని చూసిన జనం ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో డెలివరీ బాయ్‌ గుర్రపు స్వారీ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు డెలివరీబోయ్‌ సమయస్పూర్తికి ఆశ్చర్యపోయారు. పలువురు పని విషయంలో ఆ యువకుడికి ఉన్న నిబద్ధతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నో పెట్రోల్‌.. ఫాస్ట్‌ డెలివరీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన కొందరు రాజకీయ నాయకులు స్వయంగా యువకుడిని పిలిచి యువకుడిని ప్రశంసించడంతోపాటు ఆర్థిక సాయం అందించారు. అతని పేదరికం, పనిపట్ల ఉన్న శ్రద్ధను కొనియాడారు. అలాగే మరికొందరు సైతం ముందుకొచ్చి ఆ డెలివరీ బాయ్‌కి సహాయం అందించి అభినందించారు. వాళ్ల ఇంట్లో గుర్రాలు ఉండేవని, చిన్నప్పటి నుంచే తనకు గుర్రపు స్వారీ అలవాటని అది ఇప్పుడు ఇలా ఉపయోగపడిందని ఫారూఖ్‌ తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.