Peddapally: కుక్కకాటుకు మంత్రం., మట్టి ముద్ద..! రేబిస్ రాదంటున్న నాటు వైదుడు.
ఇప్పటి వరకూ మనకు పాము, తేలు లాంటివి కరిస్తే మంత్రం వేయడం గురించి విన్నాం. కానీ కుక్క కాటుకి కూడా మంత్రం వేసేస్తున్నాడు ఓ వ్యక్తి. పెద్దపల్లి జిల్లాలో ముస్తాక్ అనే వ్యక్తి కుక్కకాటుకు మంత్రం వేసి ఇచ్చే, నీళ్లు తాగితే రేబిస్ రాదని చెబుతున్నాడు. అంతేకాదు.. ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి కూడా వెళ్లమంటూ సలహా ఇస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో ఇక్కడ కుక్క కరిస్తే ఇప్పటికీ మంత్రాన్ని నమ్ముతున్నారు.
ఇప్పటి వరకూ మనకు పాము, తేలు లాంటివి కరిస్తే మంత్రం వేయడం గురించి విన్నాం. కానీ కుక్క కాటుకి కూడా మంత్రం వేసేస్తున్నాడు ఓ వ్యక్తి. పెద్దపల్లి జిల్లాలో ముస్తాక్ అనే వ్యక్తి కుక్కకాటుకు మంత్రం వేసి ఇచ్చే, నీళ్లు తాగితే రేబిస్ రాదని చెబుతున్నాడు. అంతేకాదు.. ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి కూడా వెళ్లమంటూ సలహా ఇస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో ఇక్కడ కుక్క కరిస్తే ఇప్పటికీ మంత్రాన్ని నమ్ముతున్నారు. చక్కెర, నీళ్లను మంత్రించి ఇస్తే చాలు అంతా నయమైపోతుందట, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గ్రామంలో కుక్క కాటుకు మంత్రాన్ని నమ్ముతున్నారు ఈ ప్రాంత వాసులు. గ్రామానికి చెందిన ముస్తాక్ అనే వ్యక్తి.. కుక్క కాటుకు చక్కెర, నీటిని మంత్రించి ఇస్తున్నాడు. వారం రోజులపాటు మంత్రించి ఇచ్చిన చక్కెర, నీటిని సేవిస్తే రాబిస్ రాదట, అంతేకాదు, మంత్రం వేసిన తర్వాత ఒక చిన్న మట్టిముద్దను ఇస్తున్నాడు. బాధితులను కరిచిన కుక్క మంచిదైతే ఈ మట్టి ముద్దలో వెంట్రుకలు రావట, పిచ్చి కుక్క అయితే ఆ మట్టి ముద్దలో వెంట్రుకలు వస్తాయని ముస్తాక్ చెప్పాడు. దాదాపు 200 వందల ఏళ్లుగా తన తండ్రి, తాత, ముత్తాతల నుండి కుక్క కాటుకు మంత్రం వేస్తున్నట్టు ముస్తాక్ వివరించాడు.
వంశపారంపర్యంగా ఈ వైద్యం కొనసాగుతోందని, అందరికీ మంచే జరుగుతుందని తెలిపాడు. అంతేకాదు ఈ మంత్రాన్ని ఆది, గురు వారాల్లో మాత్రమే వేస్తారట. కుక్క కరిస్తే కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించాలని, పత్యం కూడా చేయాలని చెప్తున్నాడు. ఇది వ్యాపారం కాదని, సేవాభావంతోనే చేస్తున్నామని, బాధితులనుంచి డబ్బు డిమాండ్ చేయమని తెలిపాడు. ప్రస్తుత కాలంలో మందులు అందుబాటులో ఉన్నాయి కనుక మంత్రంతో పాటు హాస్పటల్లో ఇంజక్షన్ కూడా చేయించుకోవాలని సూచిస్తున్నాడు. అయితే మంత్రం పేరిట జనాల్ని మోసం చేస్తున్నారని, నిజంగా మంత్రానికి తగ్గితే మళ్లీ ఆస్పత్రికెళ్లి ఇంజక్షన్లు చేయించుకోమని చెప్పడమేంటన్నది విమర్శకుల మాట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.