Viral: బియ్యం గింజలతో అయోధ్య రామాలయ నమూనా.! వినూత్న భక్తి చాటుకున్న సూక్ష్మకళాకారుడు.

Updated on: Jan 22, 2024 | 10:40 AM

16 కళలు సంపూర్ణంగా కలిగిన మర్యాదపురుషోత్తముడు శ్రీరాముడు. ప్రస్తుతం భారతదేశమంతా శ్రీరామనామం మార్మోగుతోంది. రాముడు మళ్ళీ అవతరించబోతున్నాడా.. శ్రీరామరాజ్యం రాబోతోందా అన్నట్టుగా ఆసేతుహిమాచలం రామభక్తిలో మునిగితేలుతోంది. 2024 జనవరి 22న రామజన్మభూమి అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఆ శుభసమయం ఇంక కొద్ది గంటల దూరంలోనే ఉంది. ఈ క్రమంలో రామభక్తులు తమదైనశైలిలో తమ భక్తిని చాటుకుంటున్నారు.

16 కళలు సంపూర్ణంగా కలిగిన మర్యాదపురుషోత్తముడు శ్రీరాముడు. ప్రస్తుతం భారతదేశమంతా శ్రీరామనామం మార్మోగుతోంది. రాముడు మళ్ళీ అవతరించబోతున్నాడా.. శ్రీరామరాజ్యం రాబోతోందా అన్నట్టుగా ఆసేతుహిమాచలం రామభక్తిలో మునిగితేలుతోంది. 2024 జనవరి 22న రామజన్మభూమి అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఆ శుభసమయం ఇంక కొద్ది గంటల దూరంలోనే ఉంది. ఈ క్రమంలో రామభక్తులు తమదైనశైలిలో తమ భక్తిని చాటుకుంటున్నారు. వివిధ రకాల కళలకు చెందిన కళాకారులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ వివిధ కళాఖండాలను రూపొందించి భక్తితో రామునికి సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ సూక్ష్మ కళాకారుడు బియ్యపు గింజలతో రామమందిర నమూనాను తయారుచేశారు.

ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. శ్రీరాముడు, సీతాదేవి, అయోధ్య రామాలయం ఇలా తమకు తోచిన నమూనాలను రూపొందిస్తూ రామయ్యపై భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నెస్‌ రికార్డ్‌ హోల్డర్‌, డాక్టర్‌ గుర్రం దయాకర్‌ బియ్యం గింజలతో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించారు. ఈ రామాలయ నమూనా రూపకల్పన కోసం డాక్టర్‌ దయాకర్‌ ఏకంగా 16 వేలకు పైగా బియ్యపు గింజలను వినియోగించారు. ఈ కళాఖండాన్ని దయాకర్‌ ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నారు. ఈ కళాఖండం రూపకల్పనపై స్పందిస్తూ ప్రధాని మోదీ అకుంఠిత దీక్షవల్లనే రామాలయ నిర్మాణం జరిగిందని, ఇది భారతదేశానికే గర్వకారణం అన్నారు. ఒక రామ భక్తునిగా ఈ కళాఖండాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos