అచ్చం ప్రొఫెషనల్‏లా పాట పాడి ఆకట్టుకుంటున్న చిలుకా.. ఏ పాడి పాడిదంటే.. వీడియో వైరల్..

|

Apr 11, 2021 | 8:45 PM

సాధారణంగా చిలుకలు మాట్లాడుతాయని మనందరికీ తెలుసు. కానీ అవి పాటలు కూడా పాడుతాయని మీకు తెలుసా? అవునండీ.. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు

అచ్చం ప్రొఫెషనల్‏లా పాట పాడి ఆకట్టుకుంటున్న చిలుకా.. ఏ పాడి పాడిదంటే.. వీడియో వైరల్..
Parrot
Follow us on

సాధారణంగా చిలుకలు మాట్లాడుతాయని మనందరికీ తెలుసు. కానీ అవి పాటలు కూడా పాడుతాయని మీకు తెలుసా? అవునండీ.. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అనేది సినిమాలోని పాట మాత్రమే కాదు.. వాస్తవం కూడా. టాలెంట్ మనుషుల్లోనే కాదు..పక్షుల్లో కూడా ఉంటుందని నిరూపించింది ఈ చిలుక. అమెరికా పాపులర్ సింగర్, సాంగ్ రైటర్ బియోన్స్ (beyonce) పాటను పాడి..తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది ఈ అందాల చిలుక. బియోన్స్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 17 కోట్ల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. అయితే ఎంత మంది ఫాలోవర్లు ఉన్నా… ఈ చిలుకని మాత్రం స్పెషల్ ఫాలోవల్‌గా చెప్పుకోవచ్చు.. నిజానికి బియోన్స్… ఎంతో మంది కొత్త సింగర్స్‌కి ఇన్స్‌పిరేషన్‌గా ఉంది. వారంతా ఆమె పాటలను పాడుతూ… అందులో తమ క్రియేటివిటీని కలుపుతూ… సక్సెస్‌ సాధించేందుకు చాలా ట్రై చేస్తుంటారు.

అయితే వారికి భిన్నంగా ఇప్పుడీ చిలుక బియోన్స్ పాటను పాడేసింది. ఇఫ్ ఐ వెర్ ఏ బాయ్ (If I Were A Boy) సాంగ్‌ను బియోన్స్ లాగానే రాగాలు తీసి పాడుతూ అందరినీ ఆకట్టుకుంది. ఓ ట్విట్టర్ యూజర్ … ఆ చిలుక పాట పాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా… “డౌటే లేదు… ఇది సేమ్‌ టు సేమ్‌ బియోన్స్ లాగే పాడేస్తోంది” అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు… ఆ చిలుకను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పటికే దీన్ని 56 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసిన వారంతా లైక్‌లు, రీట్వీట్ లతో నెట్టింట్లో హోరెత్తించారు.

వీడియో..

Also Read: మీ పిల్లలు చెక్కర తింటున్నారా ? వారి మెదడుపై ఈ ప్రభావం ఉంటుందట.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..

షుగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..