Bhutan airport: ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..

|

Sep 27, 2024 | 7:51 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో భూటాన్‌లోని పారో ఎయిర్‌ పోర్టు ఒకటి. ఇక్కడ చుట్టూ 18,000 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలుంటాయి. ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ పైలట్లకు పెను సవాల్‌. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 50 మంది పైలట్లు మాత్రమే ఈ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేయడానికి అర్హత సాధించారు. రన్‌వే పొడవు కూడా కేవలం 7,431 అడుగులు మాత్రమే. సో.. చిన్న విమానాలకు మాత్రమే ల్యాండింగ్‌ సాధ్యం.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో భూటాన్‌లోని పారో ఎయిర్‌ పోర్టు ఒకటి. ఇక్కడ చుట్టూ 18,000 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలుంటాయి. ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ పైలట్లకు పెను సవాల్‌. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 50 మంది పైలట్లు మాత్రమే ఈ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేయడానికి అర్హత సాధించారు. రన్‌వే పొడవు కూడా కేవలం 7,431 అడుగులు మాత్రమే. సో.. చిన్న విమానాలకు మాత్రమే ల్యాండింగ్‌ సాధ్యం. దీనికి రాడార్‌ గైడెన్స్‌ లేకుండా నడపడానికి తగిన శిక్షణ కూడా పొందిన పైలట్లు అవసరం. ఒక చిన్న తప్పు కూడా విమాన ప్రమాదానికి అది కారణమవుతుంది. సాధారణంగా పారో ఎయిర్‌ పోర్టులో ల్యాండింగ్‌కు అర్హత పొందిన పైలట్లు కేటగిరి-సి కిందకు వస్తారు. వీరిని ఏవియేషన్‌ పరిశ్రమలో డేర్‌డెవిల్స్‌తో పోలుస్తారు.

భూటాన్‌లో 97 శాతం భూభాగం పర్వతాలతో నిండిపోయి ఉంటుంది. ఇక పారో విమానాశ్రయం సముద్ర మట్టానికి 7,382 అడుగుల ఎత్తున ఉంటుంది. వాతావరణ మార్పులు, గాలి సాంద్రతలో తేడాల కారణంగా మధ్యాహ్నం వేళ ఇక్కడ విమాన ప్రయాణాలను పైలట్లు సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తారు. ఇక వర్షాకాలంలో గోల్ఫ్‌బాల్‌ సైజు వడగళ్లు ఇక్కడ సర్వసాధారణం. రాడార్‌ సిగ్నల్స్‌ సరిగ్గా పనిచేయవు. అందుకే ఇక్కడ రాత్రివేళల్లో విమానాల ల్యాండింగ్ ను అనుమతించరు. ఇక్కడ విమానం నడపాలంటే స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలనీ.. దీనిని తాము ఏరియా ట్రైనింగ్‌గా వ్యవహరిస్తామని స్థానిక డ్రూక్‌ ఎయిర్‌ పైలట్‌ చిమి దోర్జీ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on