Viral Video: పొర్లు దండాలు పెడుతున్న పాండా !! వీడియో చుస్తే అంతే
జంతువులలో పాండాలు చూడ్డానికి అందగా.. బొద్దుగా.. ముద్దుగా ఉంటాయి. ఇక అవి చేసే అల్లరి పనులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
జంతువులలో పాండాలు చూడ్డానికి అందగా.. బొద్దుగా.. ముద్దుగా ఉంటాయి. ఇక అవి చేసే అల్లరి పనులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా పాండాకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంది. ఆ పాండా చేస్తున్న అల్లరికి నెటిజన్లు అంతా ఫిదా అయిపోతున్నారు. ఇంతకు ఆ పాండా ఏం చేసిందంటే.. ఓ పార్క్ లో రెండు పాండాలు ఉన్నాయి. ఒక పాండా అటు ఇటు తిరుగుతూ ఉంటే.. మరొక పాండా మాత్రం తెగ అల్లరి చేస్తుంది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.. దానికి ఒక కర్ర దొరికింది. అంతే ఆ కర్రకు గట్టిగా హత్తుకుని నానా హంగామా చేసింది. ఆ కర్రను పట్టుకుని.. నేలపై పొర్లుతూ ఎంజాయ్ చేసింది. అది చూసి పక్కనే ఉన్న మరో పాండ ఉన్నట్టుండి దీనికేమైందబ్బా.. అన్నట్టుగా ఆశ్చర్యంగా దానివైపు చూస్తుంటే.. ఈ పాండా.. ఏందలా చూస్తున్నావ్.. నా లైఫ్ నా ఇష్టం.. కావాలంటే నాతోపాటు నువ్వూ పొర్లు.. కానీ కర్ర మాత్రం అడగొద్దు.. అన్నట్లుగా ఇది కూడా ఓ లుక్కేసింది. ఆ లుక్కుకి బెదిరిపోయిన మరో పాండా.. తన దారిన తను వెళ్ళిపోయింది. కాగా.. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.. అది కాస్తా వైరల్ గా మారింది. పాండా అల్లరిని చూసి నెటిజన్లు.. ఫిదా అయిపోతున్నారు. మరెందుకు లేట్.. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయ్యండి.
Also Watch:
MS Dhoni: అందుకే ధోని నెంబర్-7 జెర్సీ ధరిస్తాడంటా !!
Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!
Viral Video: పాములతో గేమ్స్ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్ !!
Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..

