Viral: పెళ్లి కూతురు వయసు 70.. పెళ్లి కొడుకు వయసు 35.. ఇది కదా ఇంటర్నేషనల్ మ్యారేజ్..!

Viral: పెళ్లి కూతురు వయసు 70.. పెళ్లి కొడుకు వయసు 35.. ఇది కదా ఇంటర్నేషనల్ మ్యారేజ్..!

Anil kumar poka

|

Updated on: Sep 22, 2023 | 5:50 PM

ప్రేమకు తరతమ భేదాలు, అంతరాలు ఉండబోవని కెనడా బామ్మ, పాక్‌ కుర్రాడు నిరూపించారు. పాకిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల కుర్రాడు కెనడాకు చెందిన 70 ఏళ్ల బామ్మ ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ ఎంతవరకు వెళ్లిందంటే, చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకుని, జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వరుని పేరు నయీమ్ షాజాద్. 70 ఏళ్ల కెనెడియన్ వధువు పేరు మేరీ. అయితే వీరి ప్రేమను, పెళ్లిని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రేమకు తరతమ భేదాలు, అంతరాలు ఉండబోవని కెనడా బామ్మ, పాక్‌ కుర్రాడు నిరూపించారు. పాకిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల కుర్రాడు కెనడాకు చెందిన 70 ఏళ్ల బామ్మ ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ ఎంతవరకు వెళ్లిందంటే, చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకుని, జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వరుని పేరు నయీమ్ షాజాద్. 70 ఏళ్ల కెనెడియన్ వధువు పేరు మేరీ. అయితే వీరి ప్రేమను, పెళ్లిని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. వీసా కోసం నయీమ్ ఇటువంటి పని చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని వీరిద్దరూ ఖండించారు. నయీమ్ షాజాద్, మేరీ మధ్య ఫేస్‌బుక్ ద్వారా ప్రేమ మొదలైంది. తామిద్దరూ 2012లో పరిచయం అయ్యామని నయీమ్ మీడియాకు తెలిపాడు. 2015లో మేరీ నయీమ్‌కు పెళ్లి ప్రపోజ్ చేసింది. 2017లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వీసా సమస్య కారణంగా కెనడాలో ఇద్దరూ కలిసి జీవించలేకపోయారు. మేరీ ఇటీవల పాకిస్తాన్‌ను సందర్శించి, అతని దగ్గర 6 నెలలపాటు ఉంది. నయీం గతంలో ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు. అయితే మేరీ అతనికి ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా, మానసిక ధైర్యాన్ని కూడా అందించింది. అయితే మేరీ ధనవంతురాలేమీ కాదని, పెన్షన్‌తో బతుకుతుందని నయీమ్ చెప్పాడు. తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు మేరీ ఎంతో సాయం అందించిందని, అందుకే తాను ఆమె ప్రేమలో పడ్డానని నయీమ్ తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..