Viral Video: మున్సిపాలిటీ సిబ్బంది ఓవరాక్షన్.. బతికి ఉన్న వ్యక్తిని చెత్త ట్రాక్టరులో తరలింపు.. వీడియో
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మునిసిపల్ విభాగం శానిటరి సిబ్బంది ఒంటరి వృద్ధుడి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. అనాధగా మారి జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద ఆశ్రయం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మునిసిపల్ విభాగం శానిటరి సిబ్బంది ఒంటరి వృద్ధుడి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. అనాధగా మారి జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద ఆశ్రయం పొందుతున్న రామ్మోహన్ అనే వృద్ధుడిని శానిటేషన్ విభాగం సిబ్బంది పురపాలక సంఘం చెత్త ట్రాక్టరులో డంపింగ్ యార్డుకు తరలించేందుకు ప్రయత్నించారు. వృద్ధుడిని చెత్త ట్రాక్టర్ ఎక్కించి డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా గమనించిన స్థానికులు ట్రాక్టర్‌కి అడ్డం వెళ్లి సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో స్థానికులకు, శానిటేషన్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ట్రాక్టర్ నుంచి దింపి.. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు మునిసిపల్ అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..