Lottery: రూ.25 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు.. ఫుల్‌గా మందుకొట్టి టికెట్‌ పడేశాడు.! అయినా కోటీశ్వరుడైయ్యాడు.

|

Jul 13, 2023 | 7:03 PM

అదృష్టం వెంటపడీ మరీ అతన్ని కోటీశ్వరుడ్ని చేసింది. అవును కొందరు చేతికందిన అదృష్టాన్ని జారవిడుచుకున్నా.. వారిని వెతుక్కుంటూ వెళ్తుంది. అవును, లాటరీ టిక్కెట్ల ద్వారా ఎందరో అదృష్టవంతులయ్యారు.. రాత్రికి రాత్రి సామాన్యులు కోటీశ్వరులుగా మారారు. అలాంటి సంఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం చూసాం.

అమెరికా మసాచుసెట్స్‌లో నివసించే పాల్‌ పాటిల్‌ అనే ఓ కారు మెకానిక్‌ లాటరీలో 25 కోట్లు గెలుచుకున్నాడు. అయితే, అతను టికెట్‌ కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మద్యం కోసం ఓ దుకాణం దగ్గర ఆగాడు. అక్కడ మద్యం కొనుక్కొని తన చేతిలోని లాటరీ టికెట్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఓ మహిళకు సదరు వ్యక్తి వదిలిపెట్టిన టికెట్‌ దొరికింది. లాటరీ రిజల్ట్స్‌ రానే వచ్చాయి. ఈ మెకానిక్ కొన్న టికెట్ కు 25 కోట్ల రూపాయల జాక్ పాట్ గెలుచుకుంది. లాటరీ నిర్వాహకులు విజేత మెకానిక్ పాల్ లిటిల్ పేరు కూడా ప్రకటించారు. ఆ విషయం తెలుసుకున్న పాటిల్‌ టికెట్ కోసం వెతికినా దొరకలేదు. పాటిల్‌కి అప్పుడు గుర్తొచ్చింది తను మద్యం దుకాణంలో టిక్కెట్టును మరిచిపోయినట్టు. వెంటనే మద్యం షాపుకు వెళ్లి ఆరా తీశాడు. ఆ రోజు జరిగినదానిపై అక్కడి సిబ్బంది, స్థానికుల్నిప్రశ్నించగా అందరూ కనిపించలేదని చెప్పారు. టికెట్‌ దొరికిన మహిళ కూడా తనకు దొరకలేదని అబద్ధం చెప్పింది. ఆ తర్వాత సదరు మహిళ ఆ లాటరీ టికెట్‌ పట్టుకొని లాటరీ కార్యాలయానికి వెళ్లి ఆ లాటరీ గెలుచుకున్నది తనేనని, టికెట్‌ చూపించింది. ఆ మహిళ తీరుపై అనుమానం వచ్చిన లాటరీ నిర్వాహకులు ఆరా తీశారు. విషయం అంతా తేటతెల్లం కావడంతో పాల్ లిటిల్ ఆచూకీ తెలుసుకుని లాటరీ సొమ్మును అందజేసారు. అలాగే టికెట్ దాచుకున్న మహిళపై చీటింగ్‌ కేసుపెట్టి జైలులో పెట్టారు. ఈ ఘటనపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అదృష్టం వెంటపడటం అంటే ఇదేనేమో అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...