Gold Mine Collapses: కూలిన అక్రమ బంగారు గని.. 23 మంది కార్మికులు మృతి.!
సెంట్రల్ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.
సెంట్రల్ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆంగోస్తురా మునిసిపాలిటీలో మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బుల్లా లోకా అనే ప్రాంతంలోని గనిలో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గంటసేపు బోటులో ప్రయాణిస్తేకానీ అధికారులు అక్కడికి చేరుకోవడం కష్టం. సహాయక సామగ్రితో సిబ్బంది అక్కడికి వెళుతున్నట్లు అంగోస్తురా మేయర్ తెలిపారు. ఇప్పటి వరకు 23 మృతదేహాలను వెలికి తీశామని, మరో 11 మంది గాయపడినట్లు తెలిసిందని బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో అక్కడి మీడియాకు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి, రక్షించాలన్నారు. సివిల్ డిఫెన్స్ బృందాలను ఇప్పటికే పంపామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..