AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. మరోసారి పెరగనున్న బస్ చార్జీలు..? పూర్తి వివరాలు ఇక్కడ..

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. మరోసారి పెరగనున్న బస్ చార్జీలు..? పూర్తి వివరాలు ఇక్కడ..

Anil kumar poka
|

Updated on: Apr 16, 2022 | 5:37 PM

Share

తెలంగాణలో ప్రయాణీకులపై మరో భారం మోపనుంది టీఎస్ఆర్టీసీ(TS RTC). రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్ ధరలు, పీకల్లోతు నష్టాలతో సతమతమవుతున్న ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు చార్జీలు పెంచే యోచన చేస్తుంది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం.


తెలంగాణలో ప్రయాణీకులపై మరో భారం మోపనుంది టీఎస్ఆర్టీసీ(TS RTC). రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్ ధరలు, పీకల్లోతు నష్టాలతో సతమతమవుతున్న ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు చార్జీలు పెంచే యోచన చేస్తుంది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దీంతో మరోసారి ప్రయాణీకులపైనే ఈ భారం మోపేందుకు సిద్ధమైంది. నష్టాలు తగ్గించుకునేందుకు డీజిల్ సెస్ పేరుతో 10 నుంచి 15శాతం ఛార్జీల పెంపు యోచనలో ఉంది ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటికే మార్చిలో రౌండప్‌ చార్జీలు, టోల్‌ సెస్‌, ప్యాసింజర్‌ సెస్‌ పేరిట 10 శాతానికిపైగా చార్జీలు పెంచింది. అయితే రోజుకు 10-12 కోట్ల ఆదాయం మాత్రమే రావడంతో మరోసారి సెస్‌ పేరుతో మరికొంత ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. రోజుకు 16 కోట్లకు పైగా ఆదాయం వస్తేనే ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విధించిన సెస్సులకు తోడు కొత్తగా డీజిల్‌ సెస్‌ అదనంగా వసూలు చేయాలని ఆలోచిస్తోంది RTC. పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా ఈ సెస్ వసూలు చేస్తామంటోంది.ఈ సెస్‌ పేరిట చార్జీలను మరో 10 నుంచి 15 శాతం వరకు సవరించాలని సంస్థ ప్రతిపాధిస్తుంది. దీనితో పాటు ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సెస్‌ పేరుతో మరో పెంపును కూడా త్వరలో అమలు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక ఇప్పటికే బస్‌ పాస్‌ ధరలను ఆ సంస్థ పెంచింది. చిన్న సర్దుబాటే అని TSRTC చెబుతున్నా అన్నీ కలిపేసరికి ప్రయాణికులపై పెద్ద భారమే పడుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌, వాటితో పాటు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నాడు సగటు జీవికి.. టీఎస్ఆర్టీసీ తాజా నిర్ణయంతో సామాన్యుడి ప్రయాణం మరింత కష్టతరం కానుంది.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!